News March 6, 2026

నస్రుల్లాబాద్: రొట్టె ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

image

నస్రుల్లాబాద్ మండలం దుర్కికి చెందిన చిన్న మొగులయ్య ఈ నెల 4న రాత్రి ఇంట్లో రొట్టె ముక్కలు తిని, గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక బయటకు వచ్చి రోడ్డుపై పడి మృతి చెందాడు. రొట్టె ముక్క వలన..? ఇతర కారణాల అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేశామని ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. భార్య ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News April 13, 2026

సమ్మర్‌లో సర్వర్ల దాహం.. సామాన్యుడి భారమా?

image

HYD గ్లోబల్ డేటా సెంటర్లకు అడ్డాగా మారింది. దీనివెనక భయంకరమైన వాస్తవం దాగి ఉంది. AC గదుల్లో ఉండే సర్వర్ల కోసం HMWSSB కేటాయిస్తున్న నీటితో వేలాది మంది సామాన్యుల గొంతు తడపొచ్చు. కాగా, పరిశ్రమలకు ఇచ్చే సింగిల్ విండో క్లియరెన్స్‌లో అరౌండ్ ది క్లాక్ నీటి సరఫరా నిబంధన ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తాగునీరు అనేది పౌరుడికి మొదటి ప్రాధాన్యత. పరిశ్రమలకే ప్రాధాన్యత ఇస్తే చట్టపరమైన ఉల్లంఘన అవుతోంది.

News April 13, 2026

కామారెడ్డి: అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలి

image

అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారి సుధాకర్ అన్నారు. సోమవారం జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారి సుధాకర్ అగ్నిమాపక కార్యలయంలో ఏర్పాటు చేసిన సమవేశంలో మాట్లాడారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సేఫ్ స్కూలు, సేఫ్ హాస్పిటల్, సేఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ తదితర అంశాలపై వివరించారు.

News April 13, 2026

తిరుచానూరులో TDP నేతల వసూళ్లు: YCP

image

తిరుచానూరులో అమ్మవారి ఆలయం వద్ద టీడీపీ నేతలు వసూళ్ల దందా చేస్తున్నారని వైసీపీ మండిపడింది. ‘ఇష్టమొచ్చినట్లు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఎదురు తిరిగిన భక్తులపై పాశవికంగా దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీ గూండాలు మరింతగా రెచ్చిపోతున్నారు. భక్తులు ఇంత ఇబ్బంది పడుతున్నా టీటీడీ చోద్యం చూస్తోంది’ అని వైసీపీ ట్వీట్ చేసింది.