News September 23, 2025
నాంపల్లిలో రేపు జాబ్ మేళా

నాంపల్లి పరిధిలోని విజయనగర్ కాలనీలోని శాంతినగర్ గవర్నమెంట్ ఐటీఐ కళాశాల వద్ద ఉన్న ఎంప్లాయ్ మెంట్ కార్యాలయంలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండి 25 ఏళ్ల లోపు వారై ఉండాలన్నారు. అభ్యర్థులు తగిన సర్టిఫికెట్లతో మేళాకు హాజరు కావచ్చని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి జయశ్రీ తెలిపారు. మరిన్ని వివరాలకు నంబర్ 8977175394ను సంప్రదించవచ్చు.
Similar News
News September 23, 2025
చూడముచ్చటైన బతుకమ్మ కుంట.. 25న ప్రారంభోత్సవం

అంబర్ పేటలోని బతుకమ్మ కుంటను ప్రభుత్వం చూడ ముచ్చటగా ముస్తాబు చేసింది. దాదాపు రూ.7.40 కోట్లు ఖర్చుపెట్టి చెరువును సుందరంగా తీర్చిదిద్దింది. దాదాపు 5 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువులో వ్యర్థాలను మొత్తం తొలగించారు. ఈనెల 25న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News September 23, 2025
HYD: డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌లో దుప్పట్లు, పరదాలు..!

హైదరాబాద్ నగరంలోని రెడ్ హిల్స్, నాంపల్లి, బహదూర్‌పూర, తిరుమలగిరి, అంబర్పేట, రామంతపూర్ ప్రాంతాల్లో డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ క్లీనింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మ్యాన్‌హోల్స్ నుంచి చెత్త చెదారం, దుప్పట్లు, దుస్తువులు, పరదాలు, తాళ్లు, చివరికి కుర్చీ సైతం బయటపడినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఎలాంటి వస్తువులను డ్రైనేజీలో పడేయొద్దని ప్రజలకు సూచించారు.
News September 23, 2025
ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో అతిపెద్ద బతుకమ్మ

ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం అతిపెద్ద బతుకమ్మ వేడుకలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా 60 అడుగుల ఎత్తు ఉన్న బతుకమ్మను పూలతో తయారు చేయనున్నారు. ఈ వేడుకల్లో పది వేల మంది మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడనున్నారు. ఇది గిన్నిస్ రికార్డుకు ప్రయత్నం కానుంది.