News January 25, 2026
నాంపల్లి అగ్నిప్రమాదం.. షాప్ ఓనర్ అరెస్ట్

నాంపల్లిలోని అబిడ్స్ ప్రాంతంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరణించిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్‌ఎస్ 110 సెక్షన్ కింద దుకాణ నిర్వాహకుడు సతీశ్ బచా(54)పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నారు.
Similar News
News February 9, 2026
గుంటూరులో ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు

గుంటూరు వేంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా జరుగుతున్న “భారత రంగ్ మహోత్సవ్-అంతర్జాతీయ నాటకోత్సవాలు” సోమవారంతో 4వ రోజుకు చేరాయి. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. తెలుగు నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, తదితరులు పాల్గొని సీనియర్ కళాకారులను ప్రత్యేకంగా సత్కరించారు.
News February 9, 2026
చెవులు లేకున్నా వింటాయివి!

ప్రత్యేక శరీర ఆకృతి, కండరాల నిర్మాణంతో కొన్ని జీవులు బాహ్య చెవులు లేకున్నా వినగలుగుతాయి. పాములకు దవడ ఎముక ద్వారా లోపలి చెవికి సౌండ్ సిగ్నల్స్ అందుతాయి. సాలీడు కాళ్లపై ఉన్న వెంట్రుకలు వైబ్రేషన్స్ విని అపాయాన్ని పసిగడతాయి. సాలమండర్లు చర్మం, వాటి పుర్రె ఎముకలు.. బల్లుల అంతర్గత శరీరాకృతి వల్ల వినగలుగుతాయి. చాలా రకాల చేపలు సైతం అవి తిరిగే ప్రాంతంలో ప్రత్యేకమైన సిస్టమ్ ఏర్పరచుకొని సౌండ్స్ వింటాయి.
News February 9, 2026
VJA: బాండెడ్ లేబర్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

బాండెడ్ లేబర్ వ్యవస్థ (రద్దు) చట్టం, 1976 అమలులోకి వచ్చి నేటికి 50ఏళ్లు పూర్తైన సందర్భంగా కార్మిక కమిషనర్, ఆదేశాల మేరకు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టరేట్‌లో బాండెడ్ లేబర్ నిర్మూలనపై జాయింట్ కలెక్టర్ ఇలక్కియా పోస్టర్లను విడుదల చేసి, ప్రతిజ్ఞ చేశారు. అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుంచి విజయవాడలోని బి.ఆర్. అంబేడ్కర్ స్మృతి వనం వరకు నిర్వహించినట్లు తెలిపారు.


