News February 11, 2025
నాంపల్లి: జబల్‌పూర్ ప్రమాద ఘటనపై కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి

జబల్‌పూర్‌లో జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో ఏడుగురు హైదరాబాద్ వ్యక్తులు మృతిచెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి.. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని కోరినట్లు తెలిపారు. గాయపడిన ఇద్దరికి సరైన చికిత్స అందించాలని సూచించామన్నారు.
Similar News
News January 1, 2026
‘సిటీ ఆఫ్ హనీ’ అని దేనిని పిలుస్తారో తెలుసా?

సంప్రదాయ, ఆధునిక పద్ధతుల్లో తేనె ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌ను ‘సిటీ ఆఫ్ హనీ’ అని పిలుస్తారు. ఇండో-నేపాల్ బార్డర్ సమీపంలో ఉన్న ఈ ప్రాంతం పండ్ల తోటలు, పూల వనాలతో తేనెటీగల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన తేనెను యూరప్, గల్ఫ్, సౌత్ ఈస్ట్ ఏషియాకు ఎగుమతి చేస్తారు. దేశంలోని చాలా రాష్ట్రాలకు కూడా మహారాజ్‌గంజ్ నుంచే సప్లై అవుతుంది.
News January 1, 2026
‘రాష్ట్రంలోనే జగిత్యాలను ప్రథమ స్థానంలో నిలుపుదాం’

విద్యా రంగంలో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుదామని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ JGTL జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సం.డైరీ, క్యాలెండర్‌ను గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ రాజా గౌడ్, DEO రాములు ఆవిష్కరించారు. ఇందులో TRS రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, జిల్లా అధ్యక్షులు తుంగూరి సురేష్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
News January 1, 2026
వరంగల్: న్యూ ఇయర్ వేళ ప్రభుత్వ ఆసుపత్రిలో కవలల జననం!

న్యూ ఇయర్ వేళ జన్మించిన కవలలు ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపారు. 2026 నూతన సంవత్సరం వేళ వరంగల్ CKM ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో గురువారం ఉదయం వరంగల్ గిర్మాజిపేటకు చెందిన ఓ మహిళ ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చింది. వీరితో పాటు ఆసుపత్రిలో మరో 10 మంది మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు జన్మించారు. జీవిత కాలం గుర్తుండేలా నూతన సంవత్సరంలో పుట్టిన పిల్లలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.


