News August 19, 2024

నాంపల్లి: హజ్ యాత్ర దరఖాస్తులకు కౌంటర్లు

image

కేంద్ర ప్రభుత్వం 2025 హజ్ యాత్ర షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఈ నెల 19వ తేదీ నుంచి హజ్ యాత్రకు ఆన్లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. యాత్రికుల సౌకర్యార్థం నాంపల్లి హజ్‌హౌస్‌లోని రాష్ట్ర హజ్ కమిటీ కార్యాలయంలో సోమవారం నుంచి ఆన్లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వారిని హజ్ యాత్రకు నేరుగా ఎంపిక చేయనున్నారు.

Similar News

News September 27, 2024

సీఎం‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

image

హైడ్రాపై సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టి పేరు తెచ్చుకోవాలి.. మీరు కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా? పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

News September 26, 2024

గచ్చిబౌలి: మహిళా పోరాట శక్తికి ప్రతీకగా నిలిచారు: సీపీ

image

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా.. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా పోరాట శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు.

News September 26, 2024

HYD: ఇళ్లకు ‘RB-X’ మార్కింగ్..!

image

మూసీ నది ప్రక్షాళనలో భాగంగా <<14199043>>ఇళ్లు కోల్పోయే వారికి<<>> పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అధికారులు చర్యలు చేపట్టారు. అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చేందుకు రీ సర్వే చేస్తున్నారు. ఓనర్ల నుంచి ఇంటి పత్రాలు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ శివకుమార్, తహశీల్దార్లు సంధ్యారాణి, అహల్య ఆధ్వర్యంలో కూల్చివేసే ఇళ్లకు RB-X పేరిట మార్కింగ్ చేస్తున్నారు.