News April 14, 2025

నాకు మంత్రి పదవొస్తే ప్రేమ్‌సాగర్‌ రావుకు ఏంటి: బెల్లంపల్లి

image

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌‌సాగర్ రావు తన పట్ల హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంత్రి పదవి విషయంలో తుది నిర్ణయం అధిష్ఠానందేనని పేర్కొన్నారు. అంతేకాని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. 70 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి వస్తే ప్రేమ్‌సాగర్‌రావుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు.

Similar News

News July 5, 2025

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

image

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్లలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైరబోయిన వెంకటేశ్వర్లు (36) రాత్రి పీర్ల ఊరేగింపులో ఉండగా ప్రత్యర్థులు గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు. అయితే హత్యకు గురైన వ్యక్తి సుమారు నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు కూడా హత్యకు గురయ్యాడు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

News July 5, 2025

సిద్దిపేట: ‘విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి’

image

విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. గజ్వేల్ పాత సయ్యద్ హాసిమ్ ఇంజినీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను శుక్రవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

News July 5, 2025

రణస్థలం: ఏడో తరగతి బాలికపై అత్యాచారయత్నం

image

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ విశాఖలోని రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను శుక్రవారం తన గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.