News April 11, 2024

నాగర్‌కర్నూలు లోక్‌సభ: BRS సమన్వయకర్తలు వీళ్లే..

image

నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నియమించారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ సమన్వయకర్తలు.. నాగర్‌కర్నూలు–వాల్యానాయక్‌, గద్వాల–ఇంతియాజ్‌ అహ్మద్‌, అలంపూర్‌–దేవరమల్లప్ప, కల్వకుర్తి–చాడా కిషన్‌రెడ్డి, వనపర్తి–బైకాని శ్రీనివాస్‌ యాదవ్, అచ్చంపేట – నవీన్‌కుమార్‌రెడ్డి, కొల్లాపూర్‌ – డాక్టర్‌ ఆంజనేయులు గౌడ్ నియమించారు.

Similar News

News October 1, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న అమ్మాయిలు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత 3ఏళ్లుగా జననాల రేటులో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది. గత ఏడాదిలో బాలురు 28,891 జననాలు నమోదు కాగా.. అమ్మాయిలు 25,822 మంది మాత్రమే ఉన్నారు. పలు స్కానింగ్ కేంద్రాల్లో బేబీ జెండర్ గురించి చెప్తున్నట్లు సమాచారం. ఇలాగైతే బాలికల శాతం తగ్గనుంది. బాలికల కోసం సంక్షేమ పథకాలను అవగాహన కల్పిస్తూ.. స్కానింగ్ కేంద్రాలు తనిఖీలు చేస్తున్నామని DMHO పద్మా తెలిపారు.

News October 1, 2024

శ్రీశైలంలో 880.4 అడుగుల నీటిమట్టం

image

శ్రీశైలం జలాశయంలో సోమవారం నీటిమట్టం 880.4 అడుగుల వద్ద 190.3330 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల ద్వారా మొత్తం 81,607 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది.ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో 16.335 M.U విద్యుదుత్పత్తి చేస్తూ 36,163 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 5.356 M.U ఉత్పత్తి చేస్తూ 22,197 మొత్తం 58,360 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్ కు విడుదల చేస్తున్నారు.

News October 1, 2024

MBNR: జూ.అధ్యాపకుల ఎదురుచూపులు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీలో ఎంపికైన వారికి ఈనెల 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వం కేవలం 55 రోజుల్లో డీఎస్సీ ఫలితాలను వెల్లడించి 10 రోజుల్లో నియామక పత్రాలు అభ్యర్థులకు అందించనుంది. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకుల భర్తీని పట్టించుకోవడంలేదని ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియామక పత్రాల కోసం ఎంపికైన వారు ఎదురుచూస్తున్నారు.