News December 19, 2025
నాగర్‌కర్నూల్‌ను వణికిస్తున్న చలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. బల్మూరు మండలం కొండారెడ్డిపల్లిలో అత్యల్పంగా 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెలకపల్లిలో 10.4, తోటపల్లిలో 10.5, అమ్రాబాద్‌లో 10.6, లింగాలలో 10.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలితో జిల్లా ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
Similar News
News December 19, 2025
విజయవాడ: మాతృత్వాన్ని మరచిన సరోజ..!

విజయవాడ కబేళా సెంటర్‌కు చెందిన బలగం సరోజ అలియాస్ సరోజిని పిల్లల విక్రయ ముఠాకు ప్రధాన నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. పిల్లల అక్రమ విక్రయాన్ని ఆదాయ వనరుగా మలుచుకుంది. తల్లి ఒడిలో ఉండాల్సిన అభం శుభం తెలియని చిన్నారులను వేలం వేసి విక్రయిస్తోందని దర్యాప్తులో వెల్లడైంది. మహిళగా మాతృత్వాన్ని విస్మరించి, నెలలు నిండని పిల్లలను అక్రమంగా విక్రయిస్తూ మరోసారి పోలీసుల చేతికి చిక్కింది.
News December 19, 2025
పాలమూరు: ఈనెల 21న.. U-19 కరాటే ఎంపికలు

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల, బాలికలకు కరాటే ఎంపికలను ఈనెల 21న మహబూబ్ నగర్ లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్ నిర్వహిస్తున్నట్లు SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఆసక్తిగల జిల్లా క్రీడాకారులు ఒరిజినల్ టెన్త్ మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు.
SHARE IT
News December 19, 2025
అలాంటి ఒప్పందమే లేదు.. ఐదేళ్లు నేనే సీఎం: సిద్దరామయ్య

పవర్ షేరింగ్‌పై ఎలాంటి రహస్య ఒప్పందం జరగలేదని కర్ణాటక CM సిద్దరామయ్య అన్నారు. ఐదేళ్లు తానే CMగా కొనసాగుతానని అసెంబ్లీలో చెప్పారు. ‘నేను ఇప్పుడు సీఎంను. హైకమాండ్ డిసైడ్ చేసే వరకు కొనసాగుతా. అధిష్ఠానం నాకే ఫేవర్‌గా ఉంది. 2.5 ఏళ్ల ఒప్పందమేదీ జరగలేదు’ అని తెలిపారు. CM పదవిపై DK శివకుమార్, సిద్దరామయ్య మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ <<18446337>>బ్రేక్‌ఫాస్ట్<<>> మీటింగ్స్ నిర్వహించారు.


