News February 21, 2025

నాగర్‌కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

image

తాడూరు మండల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తెలకపల్లి మండలం అనంతసాగర్‌కి చెందిన శ్రీను(42), శేఖర్(30)లు బైక్‌పై హైదరాబాద్ వెళ్తున్నారు. వీరి బైక్‌ని తాడురు సమీపంలోని గుంతకోడూరులో ఓ కారు ఢీకొనగా.. ఇద్దరు కిందపడ్డారు. వీరి పైనుంచి ఆ కారు వెళ్లటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందారు.

Similar News

News January 1, 2026

MBNR: ట్రాలీ బోల్తా.. 15 మేకలు మృతి

image

ఇల్లందు మండలం పోచారం తండా సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మేకలు మృతి చెందాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సంచార జీవుల మేకల ట్రాలీ, గుండాల మండలం శెట్టిపల్లి నుండి మేత కోసం వెళ్తుండగా పోచారం గుట్ట వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాలీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, లోపల ఉన్న 15 మేకలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

News January 1, 2026

MBNR: 31st ఎఫెక్ట్.. 86 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు

image

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31stన మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్‌లతో పాటు ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. మొత్తం 86 మంది వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని వెల్లడించారు.

News January 1, 2026

MBNR: రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు ప్రారంభం

image

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) మధుసూదన్ నాయక్ 37వ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాల కార్యక్రమాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నినాదాలు, పోస్టర్లతో అలంకరించిన వాహనంను పచ్చ జెండా ఊపి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..రవాణా శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి నెలరోజుల పాటు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు.