News August 18, 2025
నాగర్‌కర్నూల్‌లో పాఠశాలలకు సెలవు

నాగర్‌కర్నూల్‌లో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా కొన్ని పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. రాకపోకలకు అంతరాయం ఉన్న పాఠశాలలకు సెలవు ఇవ్వాలని డీఈవో రమేశ్ కుమార్ ఆదేశించారు. అంతేకాకుండా, సీజనల్ వ్యాధులు రాకుండా పాఠశాలల ప్రాంగణాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు.
Similar News
News August 20, 2025
వనపర్తి: 40.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

వనపర్తి జిల్లాలో 24 గంటల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. ఘనపూర్‌లో 40.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సీపీఓ భూపాల్ రెడ్డి తెలిపారు. అమరచింతలో 21.2 మి.మీ, మదనాపూర్‌లో 12.2, పెద్దమందడిలో 16.8, గోపాల్‌పేటలో 27.4, రేవల్లిలో 22.4, పానగల్‌లో 13.8, వనపర్తిలో 22.6, కొత్తకోటలో 14.6, ఆత్మకూరులో 6.6, పెబ్బేరులో 6.8, శ్రీరంగాపూర్‌లో 8.4, వీపనగండ్లలో 10.4, చిన్నంబావిలో 9.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
News August 20, 2025
వాగుల వద్ద సెల్ఫీల కోసం వెళ్లొద్దు: ఎస్పీ

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చెరువులు, వాగులు, వంకల వద్దకు వీడియోల కోసం సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.
News August 20, 2025
CTR: వినాయక విగ్రహాలకు పర్మిషన్ ఇలా పొందండి

చిత్తూరు జిల్లాలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
➤<
➤ఫోన్ నంబర్ టైప్ చేసి ఓటీపి ఎంటర్ చేయండి
➤ తర్వాత అక్కడ అడిగే అన్ని వివరాలు నమోదు చేసి సబ్‌మిట్ చేయండి.
NOTE: అప్లికేషన్‌లో విగ్రహం సైజ్ ఎంతో చెప్పాల్సి ఉంటుంది. ముందుగానే విగ్రహాన్ని బుక్ చేసుకోండి.