News February 13, 2025
నాగర్‌కర్నూల్‌లో మహిళ దారుణ హత్య

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మహిళ దారుణ హత్యకు గురైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో శాంతమ్మ(45)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. అత్యాచారం చేసి హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఐ కనకయ్య విచారణ చేపట్టారు. ఈ ఘటన కలకలం రేపుతోంది.
Similar News
News April 23, 2025
బాలానగర్: ‘8 K.M నడిచి.. 434 మార్కులు సాధించిన గిరి పుత్రిక’

బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ విభాగంలో హేమలత.. 434/440 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు నిరుపేదలు. వ్యవసాయం జీవనం సాగిస్తున్నారు. హేమలత ప్రతిరోజు.. కళాశాలకు ఉదయం 4 కి.మీ, సాయంత్రం 4.K.M నడుస్తూ.. కళాశాలకు వచ్చి చదువుకొని అత్యధిక మార్కులు సాధించడంతో కళాశాల ప్రిన్సిపల్ రమేష్ లింగం, కళాశాల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు.
News April 23, 2025
బీజేపీ నేత హత్యకు కుట్ర: MBNR ఎంపీ అరుణ

దేవరకద్ర బీజేపీ నేత కొండ ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఇవాళ ఆమె ప్రశాంత్ రెడ్డితో కలిసి డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయి అన్నారు. రూ.2కోట్ల 50లక్షలు సుపారి ఇచ్చి హత్యకు కుట్రచేసినట్లు డీకే అరుణ అనుమానం వ్యక్తంచేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డీజీపీని కోరారు.
News April 23, 2025
MBNR: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి కొరత రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కలెక్టర్ విజయేంద్రబోయి అధ్యక్షతన జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.