News February 13, 2025
నాగర్‌కర్నూల్‌లో మహిళ దారుణ హత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739427330569_774-normal-WIFI.webp)
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మహిళ దారుణ హత్యకు గురైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో శాంతమ్మ(45)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. అత్యాచారం చేసి హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఐ కనకయ్య విచారణ చేపట్టారు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపుతోంది.
Similar News
News February 13, 2025
‘తండేల్’ కలెక్షన్ల సునామీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739437836362_1226-normal-WIFI.webp)
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఆరు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.86 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. వాస్తవ ఘటనల ఆధారంగా చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాలో హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. కాగా ఇవాళ సాయంత్రం శ్రీకాకుళంలో మూవీ యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించనుంది.
News February 13, 2025
అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739439018283_1045-normal-WIFI.webp)
AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలక ప్రాంతాల్లో భారీగా బలగాల్ని మోహరించారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ప్రకటించారు. ర్యాలీలు, సభల వంటివాటిపై నిషేధం ఉంటుందని, ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
News February 13, 2025
దామరగిద్ద: మన్యంకొండ జాతరకు వెళ్తే ఇళ్లు దోచారు !
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739438533386_774-normal-WIFI.webp)
దామరగిద్ద మండలంలోని ఉల్లిగుండం గ్రామానికి చెందిన చాలామంది తమ ఇంటి ఇలవేల్పు మన్యంకొండ జాతర రథోత్సవానికి ఎడ్లబండ్లతో బయలుదేరి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఆ గ్రామంపై కన్నేశారు. బుధవారం అర్ధరాత్రి పలు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు గమనించి వారిని వెంబడించగా.. వారు తెచ్చుకున్న బైక్ వదిలి పారిపోయినట్లు స్థానికులు వాపోతున్నారు. పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.