News December 2, 2025

నాగర్‌కర్నూల్‌లో స్వల్పంగా తగ్గిన చలి

image

NGKL జిల్లాలో గత నాలుగు రోజులుగా చలి తీవ్రత స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలను మంగళవారం ప్రకటించారు. అత్యల్పంగా చారకొండ మండలం సిరిసనగండ్లలో 17.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పదర (17.4), అమ్రాబాద్ (17.6), కల్వకుర్తి మండలం తోటపల్లి (17.6)లో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 30, 2026

వరంగల్: అమ్మ చేతి వంట.. ఆ రోజులే వేరు!

image

ఇప్పుడంటే ‘Gen Z’ పిల్లలకు షాపుల్లో దొరికే కల్తీ ఫుడ్ స్నాక్స్‌గా పెడుతున్నారు. కానీ, అప్పట్లో పల్లెటూరి పిల్లలకు చిరుతిళ్లంటే అమ్మ చేసే వంటలే. స్కూల్‌కు వెళ్లొచ్చేలోపు ఇంటి వద్ద అమ్మ వేడివేడి సర్వపిండి, బియ్యం పిండితో రొట్టె చేసేవారు. ఓరుగల్లు 90s కిడ్స్‌కి ఇదే బెస్ట్ స్నాక్స్. పొలాల నుంచి తెచ్చిన మక్క కంకులను కాల్చుకుని తింటే ఆ మజానే వేరు. మీకూ ఇలాంటి మెమోరీస్ ఉన్నాయా? కామెంట్‌లో తెలపండి. SHARE

News March 30, 2026

RBI బూస్టర్ డోస్.. భారీగా ఎగసిన రూపాయి!

image

నెట్ ఓపెన్ పొజిషన్(NOP) లిమిట్‌పై RBI తీసుకున్న నిర్ణయంతో రూపాయి బలపడింది. డాలర్‌తో పోలిస్తే 130 పైసలు ఎగసి 94.85 నుంచి 93.59కి దిగొచ్చింది. $1B వరకు విదేశీ కరెన్సీని NOPగా బ్యాంకులు తమ వద్ద ఉంచుకునేందుకు వెసులుబాటు ఉంది. దీన్ని $100 మిలియన్లకు RBI తగ్గించింది. ఏప్రిల్ 10 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో బ్యాంకులు అదనపు మొత్తాన్ని అమ్మడం వల్ల డాలర్ల లభ్యత పెరిగి డిమాండ్ తగ్గనుంది.

News March 30, 2026

1358 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు

image

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కింద వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1358 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి UPSC గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా.. దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. వీటిలో సెంట్రల్ హెల్త్ సర్వీసెస్‌లో 864 పోస్టులు, రైల్వే, ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, ఢిల్లీ కార్పొరేషన్‌లో 494 ఖాళీలున్నాయి. అర్హత: MBBS ఉత్తీర్ణత. upsconline.nic.inలో రేపు సాయంత్రంలోగా అప్లై చేయాలి. AUG-2న పరీక్ష ఉంటుంది.