News December 7, 2025

నాగర్‌కర్నూల్‌లో స్వల్పంగా తగ్గిన చలి

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే చలి తీవ్రత స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో జిల్లాలో అత్యల్పంగా చారకొండ మండలంలో 15.2 సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్‌లో 15.5, కల్వకుర్తి, అచ్చంపేట, పదర మండలాల్లో 15.9 చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Similar News

News February 3, 2026

MBNR: ఆపరేషన్ స్మైల్-XII.. ప్రశంసాపత్రాలు అందజేత

image

జిల్లాలో బాల కార్మికత్వ నిర్మూలనకు ‘ఆపరేషన్ స్మైల్-XII’లో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ డి.జానకి అభినందించారు. మంగళవారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. నోడల్ అధికారిగా సమర్థవంతంగా పనిచేసిన ఏఎస్పీ ఎన్.బి.రత్నంను ప్రత్యేకంగా అభినందించారు. బాలల ఉజ్వల భవిష్యత్తు కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

News February 3, 2026

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌ డెడ్

image

TG: జగిత్యాల(D) మొగిలిపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు రైతు కూలీలు స్పాట్‌లోనే చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు మెట్‌పల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 3, 2026

జగిత్యాల: డబ్బు–మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

image

మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నియమావళి కఠిన అమలు, డబ్బు–మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై సైబర్ పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సమావేశంలో జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.