News October 9, 2025
నాగర్‌కర్నూల్‌లో 6.47 లక్షల ఓటర్లు

నాగర్‌కర్నూల్ జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 6,47,342 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లాలో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 1,228 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో 10 జడ్పీటీసీ, 115 ఎంపీటీసీ స్థానాలకు; రెండో విడతలో 10 జడ్పీటీసీ, 99 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
Similar News
News October 9, 2025
దేశంలో నం.1 కుబేరుడిగా ముకేశ్ అంబానీ

దేశంలో టాప్-100 కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన సంపద 105బి. డాలర్లుగా ఉండగా గత ఏడాదితో పోలిస్తే 12శాతం తగ్గింది. రెండో స్థానంలో 92బి. డాలర్ల ఆదాయంతో గౌతమ్ ఆదానీ ఉన్నారు. సావిత్రి జిందాల్(ఓపీ జిందాల్ గ్రూప్), టెలికాం దిగ్గజం సునీల్ మిత్తల్, టెక్ బిలియనీర్ శివ నాడార్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
News October 9, 2025
KNR: ‘చేతిరాత చదివితే రూపం కన్పించేది’

ఉమ్మడి KNRలోని గ్రామాల్లో పోస్ట్‌మెన్‌లు ఇంటింటికీ తిరిగి ఉత్తరాలు పంచేవారు. ఆ ఉత్తరాల్లోని చేతిరాత చదివితే అవతలివారి రూపం కన్పించేది. అక్షరాల స్పర్శలో వారి ఆప్యాయత తెలిసేది. కాగా, ప్రస్తుతం ఫోన్ల వీడియో కాల్స్‌లో ఆ భావోద్వేగం కరవైంది. నేడు ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా ఉత్తరాల విలువ, ప్రత్యేకతను గుర్తు చేసుకుందాం. కాగా, కొన్ని గ్రామీణ పోస్ట్ ఆఫీసులు లేఖల సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నాయి.
News October 9, 2025
భైరవుడి ఆవిర్భావం: శివుని శక్తి స్వరూపం

సత్యానికి విరుద్ధంగా మాట్లాడిన బ్రహ్మ దర్పాన్ని అణచడానికి, మహాదేవుడు తన నుదుటి మధ్య నుంచి భైరవుడిని సృష్టించాడు. తాను ఎవరో, తన కర్తవ్యం ఏంటో భైరవుడు అడగ్గా.. శివుడు ఇలా వివరించాడు. ‘భ’ అంటే భరణం(పోషించడం), ‘ర’ అంటే రవణం(నాశనం చేయడం), ‘వ’ అంటే వమనం(సృష్టించడం). సృష్టి, స్థితి, లయ కారకుడివి నువ్వే కనుక నీవు భైరవుడివి అని నామకరణం చేశాడు. శివుని సంపూర్ణ శక్తి స్వరూపమే భైరవుడు. <<-se>>#SIVOHAM<<>>