News December 17, 2025

నాగర్‌కర్నూల్‌లో 83.1 శాతం పోలింగ్‌

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఉత్సాహంగా ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 83.1 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 1,79,464 మంది ఓటర్లకు గాను 1,49,222 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అచ్చంపేట, ఉప్పునుంతల, చారకొండ మండలాల్లో భారీగా ఓటింగ్ జరగ్గా, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 1 గంటకే 77.82 శాతం పోలింగ్‌ పూర్తి కావడం విశేషం.

Similar News

News December 17, 2025

వెయ్యి ఓట్ల మెజారిటీతో కాళేశ్వరంలో బీఆర్ఎస్ గెలుపు

image

మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం మేజర్ పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి గెలుపొందారు. సుమారు వెయ్యికి పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధికార కాంగ్రెస్‌కి సగం ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం.

News December 17, 2025

బాంబ్ డిస్పోజల్ టీంకు రెండు రోజుల శిక్షణ

image

నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో BD టీం (బాంబ్ డిస్పోజల్ టీం)కు సంబంధించి రెండు రోజుల రిఫ్రెష్‌మెంట్ కోర్స్‌ను ప్రారంభించారు. ఈ కోర్స్ పోలీస్ టీమ్ సభ్యుల ఆచరణాత్మక నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడిందని ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. BD టీం సభ్యులకు ఆధునిక సాంకేతికతలు, బాంబు డిటెక్షన్ మరియు డిస్పోజల్ పద్ధతులపై శిక్షణలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.

News December 17, 2025

కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది: హరీశ్ రావు

image

TG: రాజ్యాంగాన్ని రక్షించాలనే రాహుల్ గాంధీ నినాదం ఉద్దేశం ఇవాళ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన <<18592868>>తీర్పుతో<<>> బహిర్గతమైందని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని, అధికార పార్టీకి అనుకూల నిర్ణయాలతో రాజ్యాంగాన్ని కాలరాసిందని ఫైరయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీల నిజస్వరూపమని మండిపడ్డారు.