News April 5, 2025
నాగర్‌కర్నూల్: ‘అమ్మాయిలు.. జర జాగ్రత్త..!’

యువతులు, మహిళలను వేధింపులకు గురిచేస్తే షీటీంకు ఫిర్యాదు చేయాలని షీటీం NGKL జిల్లా ఇన్‌ఛార్జి విజయలక్ష్మి సూచించారు. పెంట్లవెల్లి KGBVలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విజయలక్ష్మి మాట్లాడుతూ.. కొత్త పరిచయాలతో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒంటరి ప్రయాణం పరిస్థితుల్లో మంచిది కాదని ఆమె సూచించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోకిరీలు వేధిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News April 5, 2025
నేడు ముప్పాళ్లకు సీఎం చంద్రబాబు

AP: CM చంద్రబాబు ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు(M) ముప్పాళ్లలో జరిగే బాబు జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో CM మాట్లాడతారు. ఆ తర్వాత పార్టీ శ్రేణులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
News April 5, 2025
రోహిత్ శర్మను ముంబై డ్రాప్ చేసిందా?

మోకాలి గాయం కారణంగా రోహిత్ శర్మ ఈరోజు మ్యాచ్ ఆడట్లేదని టాస్ సమయంలో హార్దిక్ చెప్పారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం రోహిత్‌ను ముంబై డ్రాప్ చేసిందంటూ చర్చ నడుస్తోంది. ‘డ్రాప్డ్’ అన్న హాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. జట్టుకు ఐదు కప్‌లు అందించిన ఆటగాడిని డ్రాప్ చేయడమేంటంటూ రోహిత్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తుండగా.. ఫామ్‌లో లేని రోహిత్‌ను డ్రాప్ చేసినా తప్పేంలేదంటూ ముంబై జట్టు ఫ్యాన్స్ వాదిస్తున్నారు.
News April 5, 2025
LSG విజయం.. గోయెంకా సంతోషం..!

ఐపీఎల్‌లో ముంబైతో విజయం అనంతరం LSG ఓనర్ సంజీవ్ గోయెంకా చిరునవ్వులు చిందించారు. కెప్టెన్ రిషభ్ పంత్, సిబ్బందితో కలిసి ఆయన స్టేడియంలో సంతోషంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు ఎన్నాళ్లకెన్నాళ్లకు గోయెంకా నవ్వారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఎల్ఎస్‌జీని రెండు వరుస ఓటములు పలకరించడంతో రిషభ్ పంత్‌పై గోయెంకా సీరియస్ అయిన విషయం తెలిసిందే.