News April 16, 2025
నాగర్‌కర్నూల్: ఆ టీచర్‌కు షోకాజ్ నోటీసులు

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయిని కళ్యాణికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల క్రితం 9వ తరగతి చదువుతున్న యామిని ఆలస్యంగా వచ్చిందని సదరు టీచర్ మందలించి 3 గంటలు పనిష్మెంట్ ఇచ్చింది. మనస్తాపానికి గురైన యామిని ఆత్మహత్యకు యత్నించింది. విద్యార్థినులు మంగళవారం పాఠశాల ముందు ఆందోళన చేశారు. స్పందించిన అధికారులు టీచర్‌కు షోకాజ్ నోటీసులు పంపారు.
Similar News
News April 16, 2025
భూరికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది అవకాశం

TG: రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన ‘భూభారతి’ భూరికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది వరకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కలెక్టర్లు, ఆర్డీవోలకు సవరణ అధికారులు ఇవ్వనుంది.
ఫీజుల వివరాలు..
మ్యుటేషన్/సక్సెషన్: ఎకరానికి రూ.2,500
పట్టాదార్ పాస్ బుక్: రూ.300, సర్టిఫైడ్ కాపీ: రూ.10
రికార్డ్ సవరణ/ అప్పీళ్లు: రూ.1,000
స్లాట్ రీషెడ్యూల్: తొలిసారి ఫ్రీ, రెండోసారి రూ.500
News April 16, 2025
జగిత్యాల: భూభారతితో భూ రికార్డుల ప్రక్షాళన: కలెక్టర్

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ భారతి పోర్టల్‌పై జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో RDOలు, MROలు పాల్గొన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, డిజిటలైజేషన్, హక్కుల కల్పనపై చర్చించారు. ప్రజలతో సమన్వయంతో పనిచేయాలని అధికారులను కోరారు. సర్వే పనులు నిష్పాక్షికంగా చేయాలన్నారు. భూ భారతి భవిష్యత్ తరాలకు దోహదపడే కార్యక్రమమని పేర్కొన్నారు.
News April 16, 2025
దుమ్ముగూడెం: మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు

ఆదివాసీ యువజన సంఘం పేరుతో మంగళవారం దుమ్ముగూడెం మండలంలో పలుచోట్ల కరపత్రాలు వెలిశాయి. గోవిందపురం, పెద్ద బండి రేవు, చిన్ననలబల్లి, ములకపాడు, లక్ష్మీనగరం ప్రధాన సెంటర్లలో వెలసిన కరపత్రాలలో గిరిజనులకు ఆధారమైన అడవిలోకి వెళ్లకుండా మావోయిస్టులు బాంబులు అమర్చడం సరైన పద్ధతి కాదని ఎంతకాలం ఈ అరాచకాలు, మమ్మల్ని అభివృద్ధి చెందనివ్వరా అంటూ ప్రశ్నిస్తూ కరపత్రాలలో పేర్కొన్నారు.