News December 30, 2025
నాగర్‌కర్నూల్: ఇంటర్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 వరకు జరిగే పరీక్షల కోసం జిల్లాలో 34 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Similar News
News December 31, 2025
ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్.. ₹80,915 కోట్లు కోల్పోయాడు!

ఓ బిలియనీర్ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఏకంగా ₹80,915 కోట్ల నష్టం కలిగించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకించడమే ఇందుకు కారణం. టింకాఫ్ బ్యాంక్ ఫౌండర్ టింకోవ్ 2022లో రష్యాను విమర్శించడంతో క్రెమ్లిన్ తీవ్రంగా స్పందించింది. ఆయన వాటాను విక్రయించాలని, లేదంటే బ్యాంకును జాతీయం చేస్తామని హెచ్చరించింది. దీంతో టింకోవ్ తన 35%వాటాను అమ్మేశారు. కానీ వాస్తవ విలువలో 3% చెల్లించడంతో ₹80,915cr కోల్పోయారు.
News December 31, 2025
పెరుగుతున్న ఇన్‌స్టాగ్రామ్ పేరెంటింగ్

గతంలో పిల్లల పెంపకంలో పెద్దలు, వైద్యులు, పుస్తకాలపై ఆధారపడేవారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ పేరెంటింగ్ వైరల్ అవుతోంది. మనకున్న సందేహాలు, సలహాలను టైప్ చేస్తే ఎన్నో వీడియోలు వస్తున్నాయి. విస్తృతస్థాయి పేరెంటింగ్ విధానాలు, చిన్న కుటుంబాల వారు సలహాల కోసం దీనిపై ఆధారపడుతున్నారు. అయితే ప్రొఫెషనల్, పర్సనలైజ్‌డ్ మెడికల్, ఫ్యామిలీ గైడెన్స్‌కు ఇన్‌స్టాగ్రామ్ పేరెంటింగ్ సమానం కాదని నిపుణులు చెబుతున్నారు.
News December 31, 2025
కృష్ణా: ప్రజా దర్బార్లకు క్యాన్సర్ బాధితుల తాకిడి.!

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న PGRS, ప్రజా దర్బార్లకు క్యాన్సర్ బాధితులు పోటెత్తుతున్నారు. తమకు పింఛన్ మంజూరవుతుందన్న ప్రచారంతో వారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం NTR వైద్యసేవ ద్వారా ఉచిత చికిత్స మాత్రమే అందుబాటులో ఉందని, పెన్షన్ సదుపాయం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కీమో, రేడియేషన్ తర్వాత పనులు చేయలేకపోతున్నామని, తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.


