News February 13, 2025

నాగర్‌కర్నూల్: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి: కలెక్టర్ 

image

జిల్లాలోని ప్రతి గ్రామంలో ఇల్లు లేని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఎంపీడీవోలను ఆదేశించారు. జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవోలతో అదనపు కలెక్టర్ దేవ సహాయం, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో గోపాల్ నాయక్‌లతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై సమీక్షించారు. ఇళ్లు లేని పేదలకు ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

Similar News

News November 10, 2025

‘ప్రజావాణి’కి 339 దరఖాస్తులు: జిల్లా కలెక్టర్

image

కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 339 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు. దరఖాస్తుల్లో అత్యధికంగా కరీంనగర్ నగర పాలికకు 68, హౌసింగ్ శాఖకు సంబంధించి 43 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.

News November 10, 2025

అల్లూరి జిల్లాలో 1.69లక్షలు మందికి పరీక్షలు: DEO

image

అల్లూరి జిల్లాలో 2904 ప్రభుత్వ పాఠశాలల్లో 1.69లక్షల మంది విద్యార్థులకు సోమవారం నుంచి సమ్మేటివ్- 1 పరీక్షలు ప్రారంభం అయ్యాయని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. పాడేరు గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో జరుగుతున్న పరీక్షను ఆయన పరిశీలించారు. ప్రతీ పాఠశాలలో క్రమశిక్షణతో పరీక్షలు నిర్వహించాలని టీచర్స్‌ను ఆదేశించారు. ఈ పరీక్షలు ఫలితాలు ఆధారంగా విద్యార్థికి చదువు చెప్పాలన్నారు.

News November 10, 2025

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

image

✦ విశాఖలో రియాల్టీ లిమిటెడ్ ఐటీ పార్క్, రహేజా సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
✦ ఓర్వకల్లులో డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రీస్‌కు 50ఎకరాలు, సిగాచీ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంటుకు 100Acre, అనకాపల్లి(D)లో డోస్కో ఇండియాకు 150Acre, అనంతపురంలో TMT బార్ ప్లాంటుకు 300Acre, నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ కోసం బిర్లా గ్రూపుకు భూమి కేటాయింపు
✦ కృష్ణా(D) బాపులపాడులో వేద ఇన్నోవేషన్ పార్క్(40Acre) ఏర్పాటు