News December 24, 2025
నాగర్‌కర్నూల్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, పదర, పెంట్లవెల్లి, తాడూరు, తెల్కపల్లి, తిమ్మాజీపేట, ఉప్పునుంతల, అమ్రాబాద్ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే <
Similar News
News December 25, 2025
NRPT: న్యూయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి

డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకలు ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, కార్యక్రమాలను చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
News December 25, 2025
పుణే పోరు: ఓటుకు కారు.. థాయిలాండ్ టూరు!

పుణే మున్సిపల్ ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను వరాల జల్లుతో ప్రలోభపెడుతున్నారు. థాయిలాండ్ ట్రిప్పులు, ఖరీదైన కార్లు, ప్లాట్లు, బంగారం వంటి ఆఫర్లు ఇస్తున్నారు. మహిళల కోసం చీరలు, కుట్టు మిషన్లు పంచుతున్నారు. క్రికెట్ టోర్నీలు పెట్టి నగదు బహుమతులు ప్రకటిస్తున్నారు. మరోవైపు సీట్ల సర్దుబాటుపై పవార్ వర్గాల మధ్య చర్చలు జరుగుతుంటే ఠాక్రే సోదరులు ఒక్కటవ్వడం మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
News December 25, 2025
ASF: స్లాట్‌కు 5 క్వింటాళ్లు మాత్రమే విక్రయం

రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం పత్తి రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ కోసం అవకాశం కల్పించిందని ASF జిల్లా మార్కెటింగ్ అధికారి అష్పక్ తెలిపారు. CCI వారి ఆదేశాల ప్రకారం స్లాట్ బుకింగ్ నిబంధనలలో మార్పు జరిగిందని.. ఈ నెల 25వ తేదీ నుంచి బుక్ చేసిన స్లాట్‌కు 5 క్వింటాళ్ల వరకు మాత్రమే పత్తిని విక్రయించేందుకు అనుమతి ఉంటుందన్నారు.


