News April 1, 2025
నాగర్‌కర్నూల్: ఊర్కొండపేట ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం

నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉర్కొండపేటలో మహిళపై జరిగిన అత్యాచార ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, మహిళా సంక్షేమ అధికారులతో సీతక్క మాట్లాడి.. కేసు పురోగతి వివరాలు, బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి అన్ని రకాల సహాయం అందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
Similar News
News April 5, 2025
శిల్పకళా సంపద అద్భుతం: వరంగల్ సీపీ

కాకతీయ సామ్రాజ్యమైన ఓరుగల్లు కోటను శుక్రవారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు తిలకించారు. కళాఖండాలను, వాటి చరిత్రను పర్యాటకశాఖ గైడ్ రవి యాదవ్ వారికి వివరించారు. కళా తోరణాల మధ్యలో ఉన్న శిల్పకళా సంపదను చూసి అద్భుతం అని కొనియాడారు. కుష్మహల్, ఏకశిల కొండ, స్వయంభు దేవాలయం, శృంగారపు బావి, అనంతరం సౌండ్ అండ్ లైట్‌షో తిలకించారు.
News April 5, 2025
గండేపల్లి: రోడ్డు ప్రమాదంలో ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి మృతి

గండేపల్లి హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి బాడవుల కేదార్ మణికంఠ (21) చికిత్స పొందుతూ మృతి చెందాడు. గండేపల్లి ఎస్సై శివ నాగబాబు వివరాల ప్రకారం..ఏలూరు ముదినేపల్లికి చెందిన మణికంఠ రాజమండ్రికి చెందిన విష్ణువర్ధన్‌తో కలిసి ధర్మవరంలో బిర్యానీ తినేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా గండేపల్లి శివారులో ఎదురుగా బైకు ఢీకొట్టిన ఘటనలో చనిపోయాడన్నారు.
News April 5, 2025
తాంసి: విద్యుదాఘాతంతో రైతు మృతి

తాంసి మండలం పొన్నారికి చెందిన అశిలీ పోచన్న అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోచన్న ఆదిలాబాద్ రైతు బజారులో కూరగాయాలు విక్రయిస్తుంటాడు. శుక్రవారం బల్బు వెలుగకపోవడంతో దాన్ని సరిచేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో కౌలు రైతు కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.