News October 22, 2025

నాగర్‌కర్నూల్‌: ఊర్కొండలో అత్యధిక వర్షపాతం

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలను వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. జిల్లాలోనే అత్యధికంగా ఊర్కొండలో 37.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. చారకొండలో 31.8 మి.మీ., పదరలో 22.2 మి.మీ. చొప్పున వర్షం కురిసింది. మిగతా ప్రాంతాలలో కూడా ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది.

Similar News

News October 22, 2025

కడప జిల్లాలోని స్కూళ్లకు రేపు సెలవు

image

కడప జిల్లాలో అన్ని పాఠశాలలకు గురువారం సెలవులు ప్రకటిస్తూ డీఈవో శంషుద్దీన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ కూడా పలు మండలాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 22, 2025

హైదరాబాద్ కలెక్టర్ పిలుపు

image

తెలంగాణ రైజింగ్-2047 సర్వేలో ప్రజలు, ఉద్యోగులు పాల్గొనాలని కలెక్టర్ హరిచందన పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం ఉద్దేశించిన సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. 2047 నాటికి దేశ స్వాతంత్ర్యానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ఎలా ఉండాలి? అనే దానిపై ప్రజల నుంచి సలహాలు స్వీకరించేందుకు తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వే నిర్వహిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

News October 22, 2025

2,570 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్

image

2,570 ఇంజినీరింగ్ పోస్టులకు RRB షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, బీటెక్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 31 నుంచి నవంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష(CBT-1, CBT-2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఈ నెల 31న రిలీజ్ కానుంది. వెబ్‌సైట్: <>https://www.rrbapply.gov.in<<>>