News April 10, 2025

నాగర్‌కర్నూల్: ఏప్రిల్ 16న ఉచిత కంటి వైద్య శిబిరం: నేత్రాధికారి 

image

నాగర్ కర్నూల్ పాత కలెక్టరేట్ కార్యాలయంలో ఏప్రిల్ 16వ తేదీన కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నామని జిల్లా నేత్రాధికారి కొట్ర బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. అంధత్వ నియంత్రణ సంస్థ నాగర్ కర్నూల్& మహబూబ్‌నగర్ వారి ద్వారా కంటి పరీక్షలు, ఆపై కంటి శుక్లాలు గల వారికి ఆపరేషన్లు నిర్వహించి కళ్లద్దాలు ఇస్తామన్నారు. దృష్టి లోపం గల వారికి సలహాలు, మందులు ఇస్తామని, వివరాలకు 7386940480 సంప్రదించాలన్నారు.

Similar News

News July 7, 2025

వై.రామవరం: ప్రభుత్వం ఆదుకోవాలి

image

కడుపులోని పెరుగుతున్న పెద్దకాయతో బాధపడుతూ ఓ వ్యక్తి మంచానికే పరిమితమయ్యాడు. వై.రామవరం (M) కే.ఎర్రగొండకు వెంకటేశ్‌ దీర్ఘకాలంగా ఈ వ్యాధితో బాధ పడుతున్నాడు. తల్లిదండ్రులు, తోడపుట్టిన వాళ్లు ఇటీవల మరణించారని, ఒంటరిగా ఉన్న తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.

News July 7, 2025

సినీ హీరో మహేశ్‌బాబుకు నోటీసులు

image

TG: సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న హీరో మహేశ్‌బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులిచ్చింది. తమ వెంచర్‌కు అన్ని అనుమతులున్నాయని మహేశ్ ఫొటోతో ఉన్న బ్రౌచర్ చూసి బాలాపూర్‌లో ₹34.80లక్షలు పెట్టి స్థలం కొన్నామని ఇద్దరు ఫిర్యాదు చేశారు. లేఔట్ లేకపోవడంతో డబ్బు ఇవ్వమంటే సంస్థ ₹15లక్షలే ఇచ్చిందన్నారు. దీంతో ఇవాళ విచారణకు హాజరుకావాలని మహేశ్‌తో పాటు సంస్థను కమిషన్ ఆదేశించింది.

News July 7, 2025

పటాన్‌చెరు: మృతదేహాల అప్పగింత సజావుగా జరగాలి: కలెక్టర్

image

పటానుచెరు మండలం పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల గుర్తింపు ప్రక్రియ డీఎన్‌ఏ పరీక్షల ద్వారా కొనసాగుతోందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. అంబులెన్స్, పోలీస్ ఎస్కార్ట్‌తో పాటు మృతదేహాల అప్పగింత పనులు సజావుగా జరగాలని అధికారులను ఆదేశించించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు.