News April 1, 2025

నాగర్‌కర్నూల్: కల్వకుర్తిలో విషాదం

image

కల్వకుర్తి పట్టణానికి చెందిన వీరెడ్డి మధుసూదన్ రెడ్డి కుమారుడు వీరెడ్డి ఆనంద రెడ్డి (32) బ్రెయిన్ స్ట్రోక్‌తో మంగళవారం ఉదయం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉగాది పండుగ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన ఆయన అకస్మాత్తుగా వాంతులు చేసుకోవడంతో హుటాహుటిన HYDలోని ఆస్పత్రికి తరలించారు. 2 రోజులపాటు చికిత్స పొందిన ఆయన ఈరోజు ఉదయం మృతిచెందాడు. పెళ్లి వార్షికోత్సవం రోజే మరణించడం మరింత బాధాకరం.

Similar News

News April 2, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

> వేసవిలో చిన్నారుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
> స్పాట్ వేల్యుయేషన్‌కు 683మంది: అల్లూరి డీఈవో 
> పాడేరు: నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్
> గంగవరం: జీడిపిక్కల కొనుగోలు ప్రారంభం
> కిలో జీడి పిక్కలు రూ.150కు కొనుగోలు..ఎమ్మెల్యే శిరీష
> అరకులో అక్రమ నిర్మాణాలు: ఆదివాసీ గిరిజన సంఘం
> పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో భారీ వర్షం

News April 2, 2025

అదంతా అబద్ధం: సూర్య కుమార్

image

<<15971972>>జైస్వాల్‌తో పాటు<<>> తాను కూడా ముంబై నుంచి గోవా జట్టుకు మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సూర్య కుమార్ యాదవ్ ఖండించారు. ‘మీరు జర్నలిస్టులా? స్క్రిప్ట్ రైటర్లా? నేను కామెడీ సినిమాలు చూడటం మానేసి ఇక నుంచి మీ ఆర్టికల్స్ చదువుతా’ అంటూ X వేదికగా స్పందించారు. సూర్యతో పాటు మరికొంత మంది క్రికెటర్లు గోవా జట్టులో చేరుతారని, HYD క్రికెటర్ తిలక్ వర్మనూ గోవా క్రికెట్ అసోసియేషన్ సంప్రదించినట్లు వార్తలొచ్చాయి.

News April 2, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> నర్మెట్టలో చికిత్స పొందుతూ మహిళ మృతి > ఢిల్లీకి బయలుదేరిన జనగామ జిల్లా బీసీ నేతలు > ముగిసిన మావోయిస్టు రేణుక అంత్యక్రియలు > జిల్లా వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి > సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి > చిల్పూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం > జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి జరిగిందని ఆరోపణలు > కుక్కల దాడిలో పందెం కోళ్లు మృతి

error: Content is protected !!