News August 20, 2025
నాగర్‌కర్నూల్: ‘గణేష్ మండపాలకు దరఖాస్తు చేసుకోవాలి’

నాగర్‌కర్నూల్ జిల్లాలో గణేష్ మండపాలు ఏర్పాటు చేయాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. policeportal.tspolice.gov.in పోర్టల్‌లో కమిటీ, మండపం వివరాలు, ఫోన్ నంబరు వంటి సమాచారం తప్పనిసరిగా నమోదు చేయాలని ఆయన సూచించారు. ప్రమాదాల నివారణకు ఈ జాగ్రత్తలు అవశ్యమని పేర్కొన్నారు.
Similar News
News August 20, 2025
నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ప్రొవిజనల్ లిస్టు విడుదల

TG: నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ప్రొవిజనల్ లిస్టును మెడికల్&హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులు MHSRB <
News August 20, 2025
సుల్తానాబాద్: ‘రోగులకు మెరుగైన సేవలు అందించాలి’

సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, పీఏసీఎస్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా కొనుగోలు చేసిన రూ.12.50 లక్షల విలువైన అల్ట్రాసౌండ్, ఎన్‌ఎస్‌టీ యంత్రాలను ఆయన ప్రారంభించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
News August 20, 2025
జిల్లాలో యూరియాకు కొరత లేదు: కలెక్టర్ ఇలా

నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్ టన్నుల యూరియాను అవసరం ఉన్న రైతులకే పంపిణీ చేయాలని, పంపిణీలో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని ఆమె వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆమె మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.