News February 24, 2026
నాగర్‌కర్నూల్ ఘటన.. SP కీలక ప్రకటన

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో చిన్నారి మృతికి కారణమైన నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించామని మిగిలిన నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. నిందితుల్లో సర్పంచ్ తుకారాంరెడ్డి సహా ఐదుగురు పరారీలో ఉన్నారని, ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 26, 2026
స్వీట్ క్రేవింగ్సా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి..

స్వీట్ క్రేవింగ్స్ కంట్రోల్‌కు బ్రష్ చేయడం ఒక మంచి మార్గమని న్యూట్రిషనిస్ట్‌లు చెబుతున్నారు. తీపి పదార్థాలు తినాలనే కోరిక మెదడులోని డోపమైన్ సిగ్నల్స్ వల్ల కలుగుతుంది. మనం బ్రష్ చేస్తే మింట్ ఫ్రెష్‌నెస్ ఆ సంకేతాలను అడ్డుకుని తినడం అయిపోయిందనే మెసేజ్‌ను బ్రెయిన్‌కు పంపుతుంది. ఇది మానసికమైన అలవాటును మార్చే ట్రిక్ మాత్రమే. ప్రోటీన్ లోపం లేదా నిద్రలేమి వల్ల వచ్చే క్రేవింగ్స్‌కు ఇది పరిష్కారం కాదు.
News February 26, 2026
నల్గొండ: రూ.43 కోట్ల ధాన్యం కుంభకోణం.. దంపతుల అరెస్ట్

ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి ఖజానాకు రూ.43 కోట్లు గండికొట్టిన కిలాడీల గుట్టును నల్గొండ పోలీసులు రట్టు చేశారు. కస్టమ్ మిల్లింగ్ పేరుతో 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కందుకూరి మహేందర్ దంపతులను అరెస్ట్ చేసి, నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News February 26, 2026
మా ఫోకస్ టీమ్‌ఇండియా కాదు: జింబాబ్వే స్టార్ ఇవాన్స్

T20 WC S-8లో భాగంగా భారత్‌తో నేడు జరగనున్న కీలక పోరుపై జింబాబ్వే స్టార్ బ్రాడ్ ఇవాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము టీమ్ఇండియాపై కాకుండా తమ సొంత ప్రణాళికపైనే ఫోకస్ పెట్టామని స్పష్టం చేశారు. భారత్ ప్రపంచంలోనే బెస్ట్ టీమ్స్‌లో ఒకటని.. అందుకే గ్రౌండ్‌లో 100% శ్రమించి ఆడతామని తెలిపారు. లెఫ్ట్ హ్యాండర్లతో నిండిన ఇండియా టాప్ ఆర్డర్‌ను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్లాన్స్ ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.


