News March 3, 2026
నాగర్‌కర్నూల్ జిల్లాకు 1772 హెచ్‌పీవీ టీకాలు

నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాక్సిన్ స్టోర్‌కు 1,772 హెచ్‌పీవీ టీకా డోసులు చేరుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే జిల్లా, సివిల్ ఆసుపత్రుల్లో ఈ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ రవికుమార్ నాయక్ తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ టీకాలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 3, 2026
ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ‘కచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా టెహ్రాన్‌లోని ప్రభుత్వ లీడర్‌షిప్ కాంపౌండ్‌పై అటాక్ చేశాం. అధ్యక్ష కార్యాలయం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, మిలిటరీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌పై బాంబులు వేశాం’ అని ఓ ప్రకటనలో IDF తెలిపింది.
News March 3, 2026
MDK: లవ్ ఫెయిల్.. యువతి ఆత్మహత్య!

మియాపూర్‌లో నివసిస్తున్న నర్సు (20) ప్రేమ విఫలమై హాస్టల్ గదిలో ఆత్మహత్మ చేసుకుంది. పోలీసుల వివరాలిలా.. మెదక్ జిల్లాకు చెందిన ఈమె స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుంది. ఏడాది కాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉన్న ఆమె, వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 3, 2026
అన్నమయ్య: యూట్యూబ్ చూసి బైక్‌ల చోరీలు..

పీలేరు మండలం పొంతలచెరువు క్రాస్ వద్ద వాహనాల తనిఖీలలో పోలీసులు నలుగురు అంతర్ జిల్లా బైక్ దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి అన్నమయ్య, చిత్తూరు, కడప, తిరుపతి జిల్లాల్లో చోరీ చేసిన రూ.40 లక్షల విలువైన 24 బైకులను స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్ వీడియోలు చూసి చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. వాహనాలు రికవరీ చేసిన సిబ్బందిని అన్నమయ్య జిల్లా SP ధీరజ్ కునుబిల్లీ అభినందించారు.


