News December 4, 2024

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో భూ ప్రకంపనలు..?

image

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ భూకంపం వచ్చింది. ఈరోజు ఉదయం 7.26 నుంచి 7.31 వరకు ఆయా ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే నాగర్‌కర్నూల్, వనపర్తి, షాద్ నగర్, మహబూబ్‌నగర్, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో భూమి కంపించిందని పలువురు సోషల్ మీడియాలో చెబుతుండగా దీనిపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే మీ ప్రాంతంలో భూకంపం వచ్చిందా కామెంట్ చేయండి.

Similar News

News March 29, 2026

పాలమూరు: లోక్ అదాలత్..UPDATE!!

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా వివిధ కోర్టుల పరిధిలో ఉన్న మొత్తం 3,416 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు. ఐపీసీ (IPC) కేసులు-524, డీడీ (DD) కేసులు – 794, ఈపెట్టీ (e-Petty) కేసులు – 1,979 సైబర్ క్రైమ్ కేసులు-119 ఈ కేసుల పరిష్కారంతో బాధితులకు తక్షణ న్యాయం అందించడంతో పాటు, కోర్టులపై ఉన్న భారం కూడా తగ్గినట్లు ఎస్పీ వెల్లడించారు.

News March 29, 2026

MBNR: లోక్ అదాలత్‌.. 3,416 కేసుల పరిష్కారం

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసుల పరిష్కారంలో విశేష ఫలితాలు సాధించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల పరిధిలో ఉన్న మొత్తం 3,416 కేసులు పరిష్కరింనట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలు ఈ విధమైన అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు.

News March 28, 2026

పాలమూరు: అత్యవసర పరిస్థితుల్లో అపర సంజీవని 108 సేవలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 108 సేవలు ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 అంబులెన్సులు 108కు ఫోన్ చేసిన 15 నిమిషాల లోపల సంఘటన స్థలానికి చేరుకుంటున్నాయని ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ రవి Way2Newsతో తెలిపారు. మార్చి 2025 సంవత్సరం నుంచి ఫిబ్రవరి 2026 వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 81,540 మందికి అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించి ప్రాణపాయ స్థితి నుంచి కాపాడారు.