News April 2, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇద్దరి మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో చికిత్స పొందతూ ఇద్దరు మృతి చెందారు. పోలీసుల వివరాలు.. గగ్గలపల్లికి చెందిన బాలమ్మ(60) అనారోగ్యంతో బాధపడుతుండటంతో మనస్తాపం చెంది ఈనెల 25న పురుగుమందు తాగింది. చికిత్స పొందుతూ నిన్న మృతిచెందింది. అదే గగ్గలపల్లికి చెందిన మల్లమ్మ(45) కూతురి పెళ్లికావటంతో ఒంటరిగా ఫీలై అనారోగ్యంబారిన పడింది. మనస్తాపం చెంది ఈనెల 26న పురుగుమందు తాగగా, చికిత్స పొందుతూ నిన్న చనిపోయింది.

Similar News

News December 30, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,050 తగ్గి రూ.1,36,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,800 పతనమై రూ.1,24,850 పలుకుతోంది. అటు వెండి ధర ఏకంగా రూ.23వేలు తగ్గి కిలో రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 30, 2025

వరంగల్: ఇక మునిసిపల్ పోరుపై రాజకీయం..!

image

రెండు నెలలు గ్రామ పంచాయతీ ఎన్నికల చుట్టు తిరిగిన రాజకీయాలు.. ఇప్పుడు పట్టణ పోరుపై తిరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. దీంతో ఆయా పట్టణాల్లో కౌన్సిల్ స్థానాల ఆశావహులు, నాయకుల మధ్య అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకులు వార్డుల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.

News December 30, 2025

కామారెడ్డి జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రామలక్ష్మణపల్లి 9°C, గాంధారి 9.3, లచ్చపేట 9.9, మేనూర్ 10, దోమకొండ, మాక్దూంపూర్ 10.1, సర్వాపూర్, డోంగ్లి, ఎల్పుగొండ 10.4, జుక్కల్ 10.6, నాగిరెడ్డిపేట, హాసన్‌పల్లి, ఇసాయిపేట10.7, భిక్కనూరు, పెద్దకొడప్గల్ 10.9, పిట్లం, బీర్కూర్, నస్రుల్లాబాద్11, బిచ్కుంద, మాచాపూర్ 11.2°Cల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.