News December 14, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే..!

image

బిజినేపల్లి మండలంలోని చిన్న పీర్‌ తాండా సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు మునీందర్ నాయక్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి నూర్యపై ఆయన 70 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మండలంలోని 35 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మునీందర్ నాయక్ గెలుపు పట్ల తాండా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News April 12, 2026

NTR: అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ.. బ్రేక్ దర్శనాల రద్దు

image

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరగడంతో దుర్గమ్మ అంతరాలయ దర్శనాలను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. ఆదివారం కావడంతో భక్తులు తరలిరావడంతో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బ్రేక్ దర్శనాలను నిలిపివేశారు. ఎండ తీవ్రతకు భక్తులు అల్లాడుతుండగా, దాతల సాయంతో మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న మజ్జిగ ప్యాకెట్లు సరిపోవడం లేదని, రోజుకు 10వేల ప్యాకెట్లు, ORS అందజేయాలని భక్తులు కోరుతున్నారు.

News April 12, 2026

ఆదిలాబాద్: ఇంటర్ RESULT.. విద్యార్థిని సూసైడ్

image

ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఉట్నూర్ మండలం దంతన్ పల్లికి చెందిన సౌజన్య ఆదివారం వెలువడిన ఫలితాలను చూసి తీవ్ర ఆవేదనకు గురై ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చేతికొచ్చిన కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News April 12, 2026

KMR: ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. ఈ జిల్లాలో మొత్తం 3,945 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా, 2,372 మంది ఉత్తీర్ణత సాధించి 60.13% ఫలితాలను సాధించారు. బాలుర విషయానికి వస్తే, 3,286 మందిలో కేవలం 1,200 మంది మాత్రమే పాస్ అయ్యి 36.52% ఉత్తీర్ణతకే పరిమితమయ్యారు. ఇక్కడ బాలికలు బాలుర కంటే దాదాపు 23% మెరుగైన ప్రదర్శన కనబరిచారు.