News December 15, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో తగ్గుతున్న చలి తీవ్రత

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో గత నాలుగైదురోజుల నుంచి చలి తీవ్రత తగ్గుతోంది. గడిచిన 24 గంటలో కల్వకుర్తి మండలం తోటపల్లిలో 11.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్ 11.7°C, యంగంపల్లి 12.4°C, తెలకపల్లి, కొండారెడ్డిపల్లి 12.5°C, బొల్లంపల్లి 12.8°C, తిమ్మాజిపేట 12.9°C, పెద్ద ముద్దునూరు 13.0°C, వెల్దండలో 13.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 3, 2026

రాజమండ్రి కల్తీ పాల ఘటన.. పెరుగుతున్న మృతుల సంఖ్య..!

image

రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ ఘటనలో మొత్తం 20 మంది అడ్మిట్ కాగా, ఇప్పటి వరకు మొత్తం ఏడుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. మిగిలిన 13 మంది బాధితులు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. నిన్నటి వరకు ఆరుగురు మృతి చెందగా.. నేడు చౌడేశ్వర్ నగర్‌కు చెందిన జి.సూర్యరావు(81) మృతి చెందినట్లు తెలిపారు.

News March 3, 2026

లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ సైన్యం

image

పశ్చిమాసియాలో యుద్ధం మరో స్థాయికి చేరింది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లోకి ప్రవేశించి సరిహద్దు వెంట వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులను అడ్డుకోవడానికి ‘సెక్యూరిటీ జోన్’ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ చేపట్టింది. దీనికి ప్రతిచర్యగా హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై డ్రోన్లు, రాకెట్లతో విరుచుకుపడుతోంది.

News March 3, 2026

ప్రొద్దుటూరులో తగ్గిన బంగారం ధర

image

ప్రొద్దుటూరులో మంగళవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.16,700
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,364
* 10 గ్రాముల వెండి ధర రూ.2,800.
నిన్న 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.17,000 ఉండగా నేడు రూ.300 తగ్గి రూ.16,700కు చేరింది.