News January 18, 2026
నాగర్‌కర్నూల్ జిల్లాలో విసిరిన చలి పంజా

నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు రోజుల నుంచి చలి తీవ్రత పెరుగుతుంది. గడిచిన 24 గంటలో అత్యల్పంగా అమ్రాబాద్ మండలంలో 10.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అచ్చంపేట మండలంలో 11.0, బల్మూరు, తెలకపల్లి, 11.1, బిజనేపల్లి, వెల్దండ, పదర, కల్వకుర్తి మండలాలలో 11.7 నాగర్‌కర్నూల్, ఊర్కొండ మండలంలో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఉదయం వేళలో ప్రజలు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Similar News
News March 31, 2026
భద్రాద్రి: ఎస్సీ స్కాలర్‌షిప్ గడువు పొడిగింపు

భద్రాద్రి జిల్లాలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్ రెన్యువల్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 20వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి శ్రీలత తెలిపారు. అర్హులైన విద్యార్థులు తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత ఏడాది స్కాలర్‌షిప్ పొందని వారు తక్షణమే ఆధార్ సీడింగ్, బ్యాంక్ ఖాతా ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.
News March 31, 2026
జగిత్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

జగిత్యాల జిల్లాకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 2-3 గంటల్లో జిల్లాలో ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 5-15 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షంతో పాటు గంటకు 41-61 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News March 31, 2026
ASF: పెళ్లిళ్ల సీజన్.. మృత్యుశకటాలపై ప్రయాణం

పెళ్లిళ్ల సీజన్ కావడంతో జిల్లాలోని మారుమూల గ్రామాల్లో గూడ్స్ వాహనాల ప్రయాణాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. రవాణాకు వాడే బులెరో ట్రాలీలు, వ్యాన్లలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. అద్దె తక్కువని, సౌకర్యాలు లేవని వీటిని ఆశ్రయిస్తున్నా, చిన్న పొరపాటు జరిగినా పెను ప్రమాదం పొంచి ఉంటుంది. అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


