News February 2, 2026
నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,251 టన్నుల యూరియా నిల్వలు

జిల్లాలో ప్రస్తుతం 1,251 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ సంతోశ్ తెలిపారు. ఈ యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు 27,858 టన్నుల యూరియా పంపిణీ చేశామని, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో 29 వేల టన్నులు అవసరమవుతాయని పేర్కొన్నారు. యాప్ ద్వారా యూరియా పంపిణీ పారదర్శకగా, విజయవంతంగా జరుగుతోందని కలెక్టర్ వివరించారు.
Similar News
News February 3, 2026
బీపీఎస్ ముసుగులో ముడుపులు?(2/2)

అయితే ఈ బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలు టౌన్ ప్లానింగ్ అధికారులకు ముడుపుల వనరులుగా మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెనాల్టీ చెల్లించినా అదనంగా ఇవ్వకపోతే ఫైళ్లు ముందుకు కదలవని దరఖాస్తుదారులు వాపోతున్నారు. 2970 బీపీఎస్ దరఖాస్తుల్లో కేవలం 124కే అనుమతులు లభించాయని సమాచారం. 2580 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ముసుగులో అనధికార అంతస్తుల నిర్మాణాలకు అధికారులు సహకరిస్తున్నారన్న విమర్శలున్నాయి.
News February 3, 2026
కోనసీమ: నిబంధనలు ఉల్లంఘించిన 3 స్కూల్ బస్సుల సీజ్

కోనసీమ జిల్లాలో నిబంధనలు అతిక్రమించిన మూడు స్కూల్ బస్సులను సీజ్ చేసినట్లు డీటీఓ శ్రీనివాసరావు తెలిపారు. పాఠశాల వాహనాలు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా ఓవర్ లోడ్, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వాడితే లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. విద్యార్థుల భద్రత కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
News February 3, 2026
RGM: ఒకే డివిజన్‌లో ఇద్దరికి ‘బి-ఫారం’.. రచ్చ, రచ్చ!

రామగుండం కార్పొరేషన్ 21వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి కందుల స్వరూప, ఆ తర్వాత బూర్ల లక్ష్మీకి బీ-ఫాం అందజేశారు. ఇద్దరికీ బి-ఫారం అందజేసిన నేపథ్యంలో రిటర్నింగ్ కార్యాలయంలో అధికారులతో మంగళవారం వాగ్వాదం చోటు చేసుకుంది. ముందుగా కందుల స్వరూపకు బి-ఫారం అందజేయడంతో అధికారులకు ఇచ్చారు. అనంతరం 3 గంటల తర్వాత బూర్ల లక్ష్మీ బి-ఫారం అధికారులకు అందజేయడంతో గొడవ మొదలైంది.


