News January 8, 2026

నాగర్‌కర్నూల్: జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను గురువారం వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యల్పంగా కల్వకుర్తి మండలం తోటపల్లిలో 10.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఊర్కొండ 10.8, వెల్దండ, బిజినపల్లి, బల్మూర్ మండలాల్లో 11.0, తెలకపల్లి మండలంలో 11.1, తాడూర్ మండలంలో 11.4, అమ్రాబాద్ మండలంలో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News January 10, 2026

ఊరు వెళ్తున్నారా.. జర జాగ్రత్త: వరంగల్ సీపీ

image

సంక్రాంతి పండగకు లేదా మేడారం జాతరకు వెళ్తున్నారా అయితే తగు జాగ్రత్తలను పాటిస్తూ ఊళ్లకు బయలుదేరాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని, బంగారు, వెండి వస్తువులను తమ వెంట కాని, బ్యాంకు లాకర్‌లో భద్రపర్చుకోవాలని, సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

News January 10, 2026

ఫ్లెమింగో ఫెస్టివల్.. భీములవారిపాళెంలో బోటు షికారు చేద్దాం రండి!

image

భీములవారిపాళెంలో పడవ షికారు, సరస్సు మధ్యలో పారాగ్లైడింగ్( నీళ్లమధ్యలో గాలిలో ఎగురుతూ విహరించడం) ఏర్పాటు చేశారు. సూమారు 50 వేల మంది వరకు పడవ షికారుకు వస్తారని అంచనా. ఒక్కోపడవలో 20 మందినే అనుమతించి లైఫ్ జాకెట్‌లతో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు బోటు షికారు ఉచితం కాగా పెద్దలు రూ.30 టికెట్‌ తీసుకోవాలి. VIP బోటు షికారు కోసం రెండు ప్రత్యేక పడవలను ఏర్పాటు చేశారు.

News January 10, 2026

కీసర టోల్ ప్లాజా వద్ద కొనసాగుతున్న వాహన రద్దీ

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు రావడంతో పట్టణ వాసులు పల్లె బాట పట్టారు. దీంతో జాతీయ రహదారులపై వాహనాలు కిక్కిరిసాయి. టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు క్యూలలో నిలబడ్డారు. కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. స్వర్ణ టోల్ ప్లాజా వద్ద 7 ఫాస్ట్ ట్రాక్ లైన్లు ఏర్పాటు చేసి ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా వాహనాలు వేగంగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.