News March 4, 2026

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వరుస నేరాలు.. ప్రజల ఆందోళన

image

NGKL జిల్లాలో వరుసగా జరుగుతున్న నేరాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. <<19213447>>కుమ్మెర<<>> మరువక ముందే, <<19293278>>KGBV<<>> విద్యార్థిని ప్రసవించి బిడ్డను డస్ట్‌బిన్‌లో పడేసిన ఘటన సంచలనం రేపింది. కొల్లాపూర్‌కు చెందిన గర్భిణి మౌనిక భర్త <<19293566>>వేధింపుల<<>> వల్లే మృతి చెందిదని అక్క పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిజినేపల్లి, గౌరారం శివారులో కొల్లాపూర్‌కు చెందిన జగన్ <<19278148>>హత్య<<>>కు గురయ్యాడు.

Similar News

News March 8, 2026

భారత్ దెబ్బకు స్వరం మార్చిన అమెరికా!

image

ఆయిల్ విషయంలో అమెరికా స్వరం మారింది. రష్యా చమురు కొనేందుకు భారత్‌కు ‘మినహాయింపు’ ఇస్తున్నామన్న అగ్రరాజ్యం ఇప్పుడు సాఫ్ట్ టోన్ అందుకుంది. భారత్ <<19321716>>ఘాటుగా రిప్లై<<>> ఇవ్వడమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు పెరిగితే తమ దేశంలోనూ ధరలు పెరుగుతాయన్న భయం అమెరికాను దారిలోకి తెచ్చినట్లుంది! అందుకే ‘మినహాయింపు’ స్థానంలో ‘ఇంధన స్థిరత్వం కోసం పార్ట్‌నర్స్‌తో కలిసి పని చేస్తున్నాం’ అని కొత్త రాగం అందుకుంది.

News March 8, 2026

‘రేపు కలెక్టరేట్‌లో PGRS, రెవెన్యూ క్లినిక్’

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై పూర్తి వివరాలతో కూడిన అర్జీలను సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. మధ్యాహ్నం వరకు సాగే ఈ వేదికను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News March 8, 2026

ఏడాదిలో మరో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు: సీఎం

image

AP: తెలుగు మహిళలు ఏ పని తలపెట్టినా లక్ష్యాన్ని సాధించే వరకు వదిలిపెట్టరని CM CBN కొనియాడారు. అమరావతిలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘డ్వాక్రా మహిళల ఉత్పత్తుల కోసం తీసుకొచ్చిన స్వయం బ్రాండ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తా. అప్పులు ఇప్పించే బాధ్యత నాది.. సద్వినియోగం చేసుకోవడం మీ పని. ఇప్పటికే మహిళా పారిశ్రామికవేత్తలు లక్ష దాటారు. ఏడాదిలో మరో 5L మందిని తయారుచేస్తాం’ అని పేర్కొన్నారు.