News February 2, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం

వేర్వేరు ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. కొండనాగులకు చెందిన జోగు మల్లయ్య(45), తిమ్మాజిపేట మండలం ఆవంచలో సత్తయ్య(42)లు ఇంట్లో చెప్పకుండా.. వారి వారి గ్రామ సమీపాల్లోని కుంటల్లో చేపలవేటకు వెళ్లారు. వారు ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు వెతకసాగారు. రెండురోజుల అనంతరం ఇద్దరూ ఆయా కుంటల్లో శవాలై ఆ ఊర్ల వారికి కనిపించారు. ఈ ఘటనలపై కేసునమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 30, 2026
VZM: ‘సమీకృత కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలి’

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమీకృత కుటుంబ సర్వేకు నగర ప్రజలు సహకరించాలని విజయనగరం నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమీకృత కుటుంబ సర్వే విషయంలో ప్రజలు అపోహలకు పోవద్దన్నారు. ప్రజలకు మరింత సంక్షేమ పథకాలు అందించేందుకే ఈ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. సర్వే బృందానికి కుటుంబ సభ్యులు యొక్క పూర్తీ వివరాలు తెలియజేయాలని కోరారు.
News January 30, 2026
పార్వతీపురం: గిరిజన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే వినతులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌ఛార్జ్ పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన పీజీఆర్ఎస్‌లో ఆయన పాల్గొని గిరిజనుల నుంచి 11 అర్జీలను స్వీకరించారు. ఐటీడీఏ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడి, వారి సమస్యలనుఅడిగి తెలుసుకున్నారు.
News January 30, 2026
రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన స్టిర్లింగ్

ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక T20I మ్యాచ్‌లు(160) ఆడిన ప్లేయర్‌గా నిలిచారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ(159 M) రికార్డును బ్రేక్ చేశారు. 3, 4, 5 స్థానాల్లో జార్జ్ డాక్‌రెల్(ఐర్లాండ్-153 M), మహ్మద్ నబీ(అఫ్ఘాన్-148 M), జోస్ బట్లర్(ఇంగ్లండ్-144 M) ఉన్నారు. కాగా స్టిర్లింగ్ T20Iలలో 3,874 రన్స్, 20 వికెట్లు తీశారు.


