News December 23, 2025

నాగర్‌కర్నూల్‌: టెట్‌ కోసం ఉపాధ్యాయుల పుస్తకాల కుస్తీ

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టెట్‌ (TET) ఉత్తీర్ణత తప్పనిసరి కావడంతో ఉమ్మడి జిల్లాలోని సుమారు 5,600 మంది ఉపాధ్యాయులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. జనవరి 3 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్న ఈ పరీక్షల కోసం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ పొందుతూ సన్నద్ధమవుతున్నారు. పాఠశాల విధులతో పాటు పరీక్షల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Similar News

News December 24, 2025

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, MBA/CFA/CA,M.COM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తును careers@bobcaps.in ఈమెయిల్‌కు పంపాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in

News December 24, 2025

స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని అమలు చేయాలి: కలెక్టర్

image

పర్యాటక రంగ అభివృద్ధిలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశంలో హోమ్‌స్టేలు, కొండపల్లి ఎక్స్‌పీరియన్స్ సెంటర్, పర్యాటక ఈవెంట్లు, ట్యాక్సీ యాప్‌లపై చర్చించారు. హోమ్‌స్టేలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ ప్రోత్సహించాలన్నారు. పర్యాటక సమాచారం అందుబాటులో ఉండే ట్యాక్సీ యాప్, బ్రోచర్లు ఉంచాలని సూచించారు.

News December 24, 2025

రామగిరి: ‘ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలి’

image

సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో రామగిరి మండలం సెంటినరీ కాలనీలో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను నిరుద్యోగ యువత, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం-3 ఏరియా జీఎం నరేంద్ర సుధాకరరావు తెలిపారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, జ్యూట్ బ్యాగ్ తయారీ వంటి శిక్షణలతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, గతంలో శిక్షణ పొందిన పలువురు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం అయ్యారని అన్నారు.