News April 5, 2026
నాగర్‌కర్నూల్: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం – ఎస్పీ

నాగర్‌కర్నూల్ జిల్లాలో గంజాయి, డ్రగ్స్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ హెచ్చరించారు. యువత మత్తుకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన కోరారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే ‘డైల్ 100’కు తెలపాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 9, 2026
అనకాపల్లి: ఈదురు గాలులు, వర్షానికి దెబ్బతిన్న పంటలు

జిల్లాలో పలు మండలాల్లో ఈదురు గాలులు, వర్షానికి నువ్వు, చోడి, మామిడి తోటలకు తీవ్ర నష్టం జరిగిందని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సేద్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రమణమూర్తి బుధవారం తెలిపారు. వర్షం కారణంగా సుమారు 1,000 ఎకరాల్లో పూత మీద ఉన్న నువ్వు పంటకు తీవ్ర నష్టం వాటిలినట్లు చెప్పారు. ఆలస్యంగా కాపుకు వచ్చిన మామిడి తోటల్లో పిందెలు రాలిపోయినట్లు వెల్లడించారు.
News April 9, 2026
టాయిలెట్ నిర్మాణానికి రూ.12వేలు.. ఇలా అప్లై చేసుకోండి!

TG: ‘స్వచ్ఛ భారత్ మిషన్-2’లో భాగంగా టాయిలెట్స్ లేని 2.19L ఇళ్లకు వాటి నిర్మాణం కోసం ప్రభుత్వం ₹12వేల చొప్పున అందించనుంది. 7వేల సామూహిక మరుగుదొడ్లనూ నిర్మించనుంది. ఇందిరమ్మ ఇళ్లతో పాటే మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం స్వచ్ఛ భారత్ నిధులను ఈ స్కీమ్‌కు లింక్ చేసింది. అర్హులు స్వచ్ఛ్ భారత్ సైట్‌లో <
News April 9, 2026
HNK: నిలిచిన పదోన్నతులు!

NPDCL సర్కిల్‌లో 15 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 15 నెలలుగా ఖాళీగా ఉండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పదోన్నతుల కోసం డీపీసీ జాబితా సిద్ధమైనప్పటికీ SC వర్గీకరణపై స్పష్టత లేక ప్రక్రియ నిలిచిపోయింది. హెచ్ఆర్‌డీ విభాగం స్పందన ఆలస్యం కావడంతో 23 రోజులుగా పదోన్నతులు నిలిచిపోయాయి. ఇతర సర్కిళ్లలో ప్రక్రియ పూర్తయినా ఇక్కడ మాత్రం జాప్యం కొనసాగుతుండటంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్నాయి.


