News November 11, 2024
నాగర్‌కర్నూల్: తల్లి, వదిన సహయంతో హత్య

అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగింది. SI నరేందర్‌రెడ్డి వివరాలు.. తిమ్మాజిపేట(M) రాళ్లచెరువుకు చెందిన శీను(40), గోపాల్ అన్నదమ్ములు. అన్న భార్యతో గోపాల్ వివాహేతర సంబంధం నేపథ్యంలో వీరి మధ్య గొడవలు జరిగేవి. శనివారం రాత్రి గోపాల్.. వదిన, తల్లి సహయంతో శీనును చంపేశాడు. మృతదేహాన్ని గోపాల్ అత్తగారింటి వద్ద పడేయటం చూసిన గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. ఏడుగురిపై కేసు నమోదైంది.
Similar News
News January 22, 2026
పాలమూరు కార్పొరేటర్‌కు ఫుల్ డిమాండ్

పాలమూరు కార్పొరేషన్లో కార్పొరేటర్ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. ప్రతి డివిజన్ నుంచి ఒక్కోపార్టీ తరఫున ఐదారుగురు లీడర్ల మధ్య పోటీ నెలకొంది. మరికొన్ని డివిజన్లలో 10 మందికిపై గానే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయా డివిజన్లలో క్యాండిడేట్ల ఎంపిక ప్రధాన పార్టీలకు పెద్ద సవాల్‌గా మారింది. కాంగ్రెస్ 373 మంది, BJP నుంచి 250 మంది దరఖాస్తు చేసుకోగా, BRS నుంచి 446 మంది దరఖాస్తు చేసుకున్నారు.
News January 21, 2026
మహబూబ్‌నగర్: ‘నియమాలు పాటిస్తేనే ప్రయాణం సురక్షితం’

ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. బుధవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ ముగింపు వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు వేచి చూస్తుంటారన్న విషయాన్ని గుర్తించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. నిర్లక్ష్యం వీడి ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు.
News January 20, 2026
మన్యం కొండ బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు

మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 28 నుంచి మార్చి 5 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. లక్షలాది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున రథోత్సవం శని, ఆదివారాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.


