News April 23, 2025
నాగర్‌కర్నూల్: దరఖాస్తుల ఆహ్వానం

నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల స్థాయిలో మండల, జిల్లా స్థాయి రీసోర్స్‌పర్సన్లుగా పని చేసేందుకు ఆసక్తి గల ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు. గురువారంలోగా నాగర్‌కర్నూల్‌లోని డీఈవో ఆఫీస్‌లో దరఖాస్తులు అందించాలని సూచించారు.
Similar News
News January 7, 2026
సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ట్రేడింగ్‌లో త్వరగా లాభాలు వస్తాయంటూ ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచించారు. Online trading tips పేరుతో వచ్చే కాల్స్, మెసేజ్‌లు, గ్రూపుల్లో ఇచ్చే స్టాక్ టిప్స్ నమ్మవద్దని హెచ్చరించారు. Unknown links, ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దన్నారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయాలని, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
News January 7, 2026
ఇంద్రకీలాద్రిపై సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పూజలు

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ బుధవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను బహూకరించారు.
News January 7, 2026
9న ఒంగోలులో జాబ్ మేళా..రూ.22వేల శాలరీ!

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 9వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, 18 నుంచి 30ఏళ్ల మధ్యగల యువతీ, యువకులు పాల్గొనవచ్చని తెలిపారు. 10 నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులని, నియమితులైనవారికి 22వేల వరకు వేతనం పొందే అవకాశం ఉందన్నారు.


