News January 2, 2026

నాగర్‌కర్నూల్: నిబంధనల ప్రకారమే యూరియా పంపిణీ

image

ఎరువుల డీలర్లు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. రైతు పట్టా విస్తీర్ణం, సాగు చేస్తున్న పంటను ఏఈఓల ధ్రువీకరణతో అవసరమైన మేరకే విక్రయించాలని సూచించారు. ఈ యాసంగిలో ఇప్పటివరకు జిల్లాలో 14,363 టన్నుల యూరియా పంపిణీ చేశామని, ప్రస్తుతం మరో 3,654 టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.

Similar News

News February 15, 2026

రేపు పాక్‌పై అభిషేక్ సునామీ!

image

T20WC: భారత కెప్టెన్ <<19142443>>సూర్య<<>> మాటలతో విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ రేపు పాక్‌పై ఆడటం ఖాయమైంది. అటు గంభీర్ పర్యవేక్షణలో ఇవాళ అతను ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు సైతం బయటికొచ్చాయి. ఇప్పటి వరకు అభిషేక్ పాక్‌పై ఆడిన 3 మ్యాచుల్లోనూ అదరగొట్టారు. 190 స్ట్రైక్‌రేట్‌తో 110 రన్స్ చేశారు. రేపటి మ్యాచులోనూ చెలరేగి భారత్‌కు శుభారంభం అందించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అటు అభిషేక్ ఆడనున్న నేపథ్యంలో సంజూపై వేటు పడనుంది.

News February 15, 2026

ఐదుగురి ప్రాణదాతకు అరుదైన గౌరవం

image

కేరళలో యంగెస్ట్ ఆర్గాన్ డోనర్ అలిన్ షెరిన్(10 నెలలు)కు అరుదైన గౌరవం దక్కింది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ తర్వాత అవయవదానంతో ఐదుగురికి <<19136911>>ప్రాణం పోసిన<<>> ఆ పసికందుకు పోలీస్ లాంఛనాలతో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. సీఎం విజయన్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ బాలిక భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచుతారు. బగల్ సెల్యూట్‌(ఒక రకమైన వాయిద్య పరికరం)తో సహా పోలీసు గౌరవంతో అంతిమ యాత్ర నిర్వహిస్తారు.

News February 15, 2026

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 3 రోజులు సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఆదివారం వారాంతపు సెలవుతో పాటు, సోమవారం (16-02-2026) మహాశివరాత్రి, మంగళవారం అమావాస్య సందర్భంగా మార్కెట్ లావాదేవీలు నిలిపివేయనున్నారు. తిరిగి బుధవారం నుంచి మార్కెట్ యథావిధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి, క్రయవిక్రయాల కోసం బుధవారం మార్కెట్‌కు రావాలని అధికారులు కోరారు.