News March 28, 2025
నాగర్‌కర్నూల్: బాలికపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్ఐ మాధవరెడ్డి తెలిపిన వివరాలు.. కల్వకుర్తి మండలం వెంకటాపూర్ వాసి అనిల్ గౌడ్ అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
Similar News
News March 31, 2025
కురుపాంలో ఏనుగుల గుంపు సంచారం

పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఏనుగుల గుంపు నుంచి తిప్పలు తప్పడం లేదు. పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లో సంచరిస్తూ రైతులను, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం ఉదయం కూడా కురుపాం మండలం సీతంపేట, పూతిక వలస ప్రాంతాల్లోని చెరుకు, అరటి, పామాయిల్ తోటల్లో తిరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు, అటుగా ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
News March 31, 2025
నెల్లూరు: ఏప్రిల్ 2 నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ పద్ధతి ప్రారంభం

ఏప్రిల్ రెండవ తేదీ నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రారంభిస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిర్దేశించిన సమయానికి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ పద్ధతిని అమలు చేయనున్నట్లు తెలిపారు.
News March 31, 2025
గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే

TG: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక టాపర్‌గా నిలిచారు. మొత్తం 900 మార్కులకు గానూ 550 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆమె MBBS పూర్తి చేశారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్‌కు సిద్ధమయ్యారు. నాలుగేళ్లపాటు యూపీఎస్సీ, గ్రూప్-1 కోసం సన్నద్ధమయ్యారు. దీపిక తండ్రి కృష్ణ ఏజీ ఆఫీస్‌లో సీనియర్ ఆఫీసర్.