News February 23, 2026

నాగర్‌కర్నూల్: ‘బిడ్డ ఆత్మ ఘోష వినిపించడం లేదా?’

image

కుల వివక్షకు బలైన పసి బిడ్డ ఆత్మ ఘోష పాలకులకు వినిపించడం లేదా అని పలు ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ‘ధర్నా చేసే దాకా కేసులు పెట్టరు, ఆందోళన చేసే వరకు నిందితులను అరెస్ట్ చేయరు, ఇదేనా ప్రజాస్వామ్యం’ అని మండిపడుతున్నారు. పసి బిడ్డకు న్యాయం చేయలేని ప్రభుత్వాలు ఉండి ఏం లాభమని, వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆగిన చిన్ని గుండెకు శాంతి చేకూర్చాలని కోరుతున్నారు.

Similar News

News February 24, 2026

ఆదిలాబాద్: సుమన్‌కు జైలు కొత్త కాదు: కేటీఆర్

image

మాజీ ఎంపీ, బాల్క సుమన్‌కు జైలులో ఉండటం కొత్తేమీ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న బాల్క సుమన్‌తో ములాఖత్ అయ్యాక కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో సుమన్ ఎన్నో సార్లు జైలుకు వెళ్లి వచ్చారన్నారు. జైలులో పెడితే సుమన్ భయపడతారని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే పొరపాటేనన్నారు.

News February 24, 2026

బాపట్ల జిల్లాలోని 10 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ: కలెక్టర్

image

బాపట్ల జిల్లాలోని పది గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ మంగళవారం తెలిపారు. మొత్తం 6,400 పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 1,287 మందికి అందజేశామన్నారు. మిగిలిన పుస్తకాలను అర్హులకు తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో పాసుపుస్తకాల పంపిణీ, ఈ-కేవైసీ ప్రక్రియ 68.32 శాతానికి చేరిందన్నారు.

News February 24, 2026

వనపర్తి: ఇంటర్, పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

image

వనపర్తి జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.