News December 29, 2025

నాగర్‌కర్నూల్ మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు ప్రారంభం

image

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుగా విభజించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 36,912 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీ జనాభా 433 ఎస్సీ జనాభా 5,371గా ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఓటరు జాబితాను తయారు చేయాలని అధికారులను ఈరోజు ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధం వీడింది.

Similar News

News December 30, 2025

ఐబొమ్మ రవి ‘నకిలీ’లలు!

image

ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో అతడి ‘నకిలీ’లలు బయటపడుతున్నాయి. రవి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ ఖాతా అన్నీ ఫేక్ అని గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రహ్లాద్ అనే వ్యక్తి సర్టిఫికెట్లతో పాన్, డ్రైవింగ్ తీసుకున్నట్లు సమాచారం. బ్యాంక్ అకౌంట్ అంజయ్య పేరుతో ఉందని, ప్రసాద్ అనే వ్యక్తి సర్టిఫికెట్లతోనూ మోసాలకు పాల్పడ్డాడని గుర్తించినట్లు తెలిసింది.

News December 30, 2025

ఏలూరు: న్యూ ఇయర్ లింక్స్‌తో జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!

image

నూతన సంవత్సర వేడుకల వేళ సైబర్ మోసగాళ్లు విరుచుకుపడే అవకాశం ఉందని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. గ్రీటింగ్స్, గిఫ్ట్స్, ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని సూచించింది. ఆ లింకుల ద్వారా మొబైల్‌లోకి మాల్వేర్ ప్రవేశించి, ఓటీపీలు, బ్యాంకు వివరాలను తస్కరించే ప్రమాదముందని తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా అధికారులు స్పష్టం చేశారు.

News December 30, 2025

GOOD NEWS చెప్పిన ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి వచ్చేవరకు పాత పద్ధతిలోనే ఎరువుల సరఫరా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలను పరిశీలించి, వారు సాగు చేస్తున్న పంట విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా కేటాయించాలని అధికారులను ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఎరువుల నిల్వలపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు.