News April 22, 2025
నాగర్‌కర్నూల్: రంపంతో భర్త గొంతు కోసిన భార్య..!

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వెంకటేశ్ గౌడ్ తెలిపిన వివరాలు.. అవుసలికుంటలో కురుమయ్య, చెన్నమ్మ దంపతులు ఉంటున్నారు. ఈనెల 19న భార్యతో కురుమయ్య గొడవపడ్డాడు. అదేరోజు రా.11 గంటలకు భర్త నిద్రిస్తుండగా చెన్నమ్మ కోపంతో వెళ్లి రంపం బ్లేడ్ తీసుకొచ్చి కురుమయ్య గొంతు కోసింది. అతడు అరవగా పక్కింట్లో ఉన్న బంధువులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదైంది.
Similar News
News December 14, 2025
NGKL: 23.06 శాతం పోలింగ్ నమోదు.

రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా ఏడు మండలాల్లో ఉదయం 9:00 సమయానికి 23.06 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎలక్షన్ అధికారులు వెల్లడించారు. 100% పోలింగ్ అయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు ఓటర్లు తెలుపుతున్నారు. ఓటు వినియోగించుకునేందుకు యువత మరియు గ్రామస్తులు తరలివస్తున్నారు.
News December 14, 2025
వారంలో రూ.14,100 పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల హవా కొనసాగుతోంది. ఈ వారంలో(DEC 7-13) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,760 పెరిగి రూ.1,33,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,450 పెరగడంతో రూ.1,22,750గా ఉంది. ఇక కేజీ వెండి ధర రికార్డు స్థాయిలో రూ.14,100 పెరిగి రూ.2,10,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.
News December 14, 2025
మహిళల కోసం 10 కాపీ షాపులు: DRDA పీడీ

మహిళలు స్వయం ఉపాధితో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని DRDA పీడీ ఝాన్సీరాణి పిలుపునిచ్చారు. వారి ఆర్థిక సాధికారతే లక్ష్యంగా జిల్లాలో మొత్తం 10 కాఫీ షాపులు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటివరకు ఆరుగురు మహిళలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. నరసరావుపేటలో కలెక్టరేట్, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కాఫీ షాప్ పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే నెలాఖరుకు వాటిని పూర్తి చేస్తామని ఆమె వివరించారు.


