News October 10, 2025
నాగర్‌కర్నూల్: హాస్టల్‌లో సమస్యలను పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ

నాగర్‌కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు గురువారం సమస్యలపై విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ విద్యార్థులకు దుప్పట్లు లేవని అన్నారు.
Similar News
News October 10, 2025
ఉమ్మడి విశాఖ జిల్లా హాకీ పోటీలకు 17 మంది బాలికలు ఎంపిక

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నక్కపల్లిలో జరుగుతున్న ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో 17 మంది బాలికలు ఎంపికయ్యారు. వీరు ఉమ్మడి విశాఖ జిల్లా తరపున ఆడనున్నట్లు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి నాయుడు గురువారం తెలిపారు. జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన వారిలో జయశ్రీ, లవ కుమారి, శాంతి, రాణి, లక్ష్మి, శ్రావణ దేవి, జాహ్నవి, దుర్గ, కనకమహాలక్ష్మి, సౌజన్య, పావని, టోనేశ్వరి తదితరులు ఉన్నారు.
News October 10, 2025
ఏలూరు: నర్సింగ్ జాబ్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం

AP స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కత్తర్ (దోహా)లో హోమ్ కేర్ నర్సింగ్ జాబ్స్ కొరకు మైనారిటీ యువతీ, యువకులకు నుంచి దరఖాస్తు కోరుతున్నామని జిల్లా మైనారిటీ ఆర్థిక సంస్థ కార్యనిర్వాహన సంచాలకులు ప్రభాకర్ రావు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. BSC/GNM నర్సింగ్ చదివి అనుభవం కలిగిన 21-40 సం.లు లోపు వారు అర్హులు అన్నారు. ఈ నెల 12లోగా దరఖాస్తు అందించాలన్నారు.08812-242463 సంప్రదించాలన్నారు.
News October 10, 2025
నేటి నుంచి NTR వైద్య సేవలు బంద్!

AP: రాష్ట్రంలో నేటి నుంచి NTR వైద్య సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు నిన్ననే ప్రకటించాయి. రూ.2,700 కోట్లు రావాలని, ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాయి. వైద్య సేవలు నిలిపేయొద్దని, సమస్య పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ కోరినప్పటికీ నెట్‌వర్క్ ఆస్పత్రులు వెనక్కి తగ్గలేదు.