News August 29, 2025
నాగర్‌కర్నూల్: హోంగార్డ్ కుటుంబానికి చేయూత

అచ్చంపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ చనిపోయిన అమ్రాబాద్ మండలం బి.కె.లక్ష్మాపూర్ తండాకి చెందిన హోంగార్డు జి.దశరథం భార్య సుజాతకు రూ.30,500ను అందజేశారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నగదును అందించారు. దశరథం చేసిన సేవలు పోలీసు శాఖ ఎప్పటికీ మరువలేనిదన్నారు. బాధిత కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Similar News
News August 29, 2025
మండపాల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు: ఎస్ఈ

వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ శ్యాంబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండపాల నిర్వాహకులు లైసెన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్లతోనే పనులు చేయించాలని సూచించారు. తగిన సామర్థ్యం ఉన్న ఫ్యూజ్ వాడాలని, ఓవర్ లోడ్ అవ్వకుండా చూసుకోవాలని అన్నారు. ఎంసీబీలు, ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్లు ఉపయోగించాలని అన్నారు. నాణ్యమైన వైర్లు వాడాలన్నారు.
News August 29, 2025
MBNR: ముగిసిన పీజీ పరీక్షలు.. 1,113 మంది హాజరు

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎమ్మెస్‌డబ్ల్యూ, ఎంకాం రెగ్యులర్ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు నేటితో ముగిశాయి. పీజీ ప్రిన్సిపల్ డాక్టర్ డి.మధుసూదన్ రెడ్డి, అబ్జర్వర్ డాక్టర్ నాగం కుమారస్వామి పర్యవేక్షించారు. విశ్వవిద్యాలయ పరిధిలో 1,196 మంది విద్యార్థులకు గాను 1,113 మంది హాజరయ్యారని, 83 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పరీక్షల నియంత్రణ అధికారి డా.కే.ప్రవీణ తెలిపారు.
News August 29, 2025
MNCL: 31న ఉచిత నేత్ర చికిత్స నిర్ధారణ శిబిరం

మంచిర్యాలలోని లయన్స్ భవన్ లో ఈ నెల 31న ఉచిత నేత్ర చికిత్స నిర్ధారణ శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, శ్యామ్ సుందర్ రావు, ఐ క్యాంప్స్ జిల్లా కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. శిబిరంలో 50 ఏళ్లు పైబడిన వారికి పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వారికి మరుసటి రోజు ఉచితంగా కంటి శస్త్ర చికిత్స చేయనున్నట్లు పేర్కొన్నారు.