News April 4, 2025

నాగర్‌కర్నూల్: 1 నుంచి 9వ తరగతుల పరీక్షల షెడ్యూలు విడుదల

image

నాగర్ కర్నూల్ జిల్లా విద్యా శాఖ అధికారులు ఒకటి నుంచి తొమ్మిదో తరగతుల సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల టైం టేబుల్ షెడ్యూల్‌ను ఈరోజు విడుదల చేశారు. ఈనెల 9 నుంచి 16 తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయన్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. 

Similar News

News December 24, 2025

హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>విశాఖపట్నంలోని<<>> హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ 11 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ , డిగ్రీ/పీజీ , LLB/LLM, ICAI/ICWAI, MBA, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBDలకు ఫీజు లేదు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hslvizag.in

News December 24, 2025

అంతా తానై మనల్ని రక్షిస్తున్న ‘విష్ణుమూర్తి’

image

అగ్రణీర్గ్రామణీః శ్రీమాన్న్యాయో నేతా సమీరణః|
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షస్సహస్రపాత్||
సృష్టిలో అందరికంటే ముందుండేవాడు, జీవులను సత్మార్గంలో నడిపించేవాడు, సమస్త ఐశ్వర్యాలకు అధిపతి ‘విష్ణుమూర్తి’. ఆయన నాయకుడే కాదు, న్యాయ స్వరూపుడై లోకాన్ని శాసిస్తాడు. విశ్వమంతా నిండిన ఆ ఆత్మ స్వరూపుడికి వేయి శిరస్సులు, వేయి కన్నులు, వేయి పాదములు ఉంటాయి. అంతటా తానై ఉండి మనల్ని రక్షిస్తుంటాడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News December 24, 2025

ఏజెన్సీ ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు

image

AP: ఏజెన్సీలోని ఆసుపత్రులకు మందులు తదితరాలను ఇకనుంచి డ్రోన్ల ద్వారా అందించనున్నారు. ఈమేరకు ‘రెడ్ వింగ్’ అనే సంస్థతో వైద్యారోగ్యశాఖ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఈ సంస్థ అరుణాచల్ ప్రదేశ్‌లో ఇలాంటి సేవలు అందిస్తోంది. పాడేరు కేంద్రంగా 80 KM పరిధిలోని ఆసుపత్రులకు ఈ సంస్థ డ్రోన్లతో మందులు అందిస్తుంది. డ్రోన్లు తిరిగి వచ్చేటపుడు రోగుల రక్త, మల, మూత్ర నమూనాలను తీసుకువస్తాయని కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు.