News March 20, 2025
నాగర్‌కర్నూల్: 26 రోజులైనా ఆచూకీ లేదు

SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారంతో 26 రోజులైనా కార్మికుల ఆచూకీ లభించలేదు. కేరళకు చెందిన కడావర్ డాగ్స్ గుర్తించిన D1, D2 ఏరియాల్లో ఆయా బృందాలు పనిచేస్తున్నాయి. TBM మిషన్ భాగాలు కత్తిరించి టన్నెల్ నుంచి బయటకు తీసుకొస్తున్నారు. సాంకేతిక కారణాలతో వారం రోజులుగా రోబోల సేవలు అందుబాటులోకి రాలేదు. అడ్డుగా ఉన్న టీబీఎం శకలాలను తొలిగిస్తేనే రోబో సేవలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.
Similar News
News March 20, 2025
భార్య పోర్న్ చూస్తోందని విడాకులివ్వడం కుదరదు: హైకోర్టు

భార్య పోర్న్ చూస్తోందనో లేక స్వయంతృప్తిని పొందుతోందనో భర్త విడాకులు ఇవ్వడం కుదరదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తనతో పాటు కలిసి చూడాలంటూ భర్తను ఆమె బలవంతపెట్టనంత వరకూ అది వైవాహిక క్రూరత్వం కిందకు రాదని తేల్చిచెప్పింది. భార్య పోర్న్ చూస్తూ స్వయంతృప్తిని పొందుతోందని, ఆమె నుంచి తనకు విడాకులిప్పించాలని కోరుతూ ఓ భర్త వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.
News March 20, 2025
అసెంబ్లీ నిరవధిక వాయిదా

AP: రాష్ట్ర శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. మొత్తం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. గత నెల 24 నుంచి నేటి వరకు సమావేశాలు కొనసాగాయి. 85 గంటల 55 నిమిషాల పాటు సభ కొనసాగింది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు కూటమి సర్కార్ ఆమోదం పలికింది. అలాగే 9 బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
News March 20, 2025
ఏప్రిల్ తొలివారంలో ‘ది రాజాసాబ్’ టీజర్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘ది రాజాసాబ్’ సినిమా టీజర్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు వార్తలు రాగా, టీజర్‌తో దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ తొలివారంలోనే టీజర్ విడుదల చేయాలని భావిస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. కాగా, ‘ది రాజాసాబ్’ చిత్రీకరణ ఇంకా పూర్తికాలేదని వెల్లడించాయి.